నేడు చంద్రబాబు పర్యటనలో మార్పులు 

ఇటీవల విజయవాడలో సంభవించిన వరదలలో అలుపు ఎరగకుండా శ్రమిస్తూ,  అధికారులను సమన్వయం చేసుకుంటూ, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ , తగిన సూచనలు చేస్తూ,  వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు మిగిలిన ప్రాంతాల లోని వరద పరిస్థితులను స్వయంగా తెలుసుకుని ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మేరకు షెడ్యూల్ ను రూపొందించుకున్నారు.

దీనిలో భాగంగానే చంద్రబాబు  నాయుడు ( Chandrababu Naidu )ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు.అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చేపట్టారు అధికారులు.

  పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు( West Godavari District Aakiveedu ) లో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా,  అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన పర్యటంలో స్వల్ప మార్పులు చేశారు .పశ్చిమగోదావరి జిల్లా లో చంద్రబాబు పర్యటన ను రద్దు చేశారు అధికారులు .పశ్చిమగోదావరి జిల్లాకు బదులుగా ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు.ముందుగా చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని తన నివాసం నుంచి ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా కైకలూరు,  కొల్లేరు( Kaikaluru, Kolleru ) ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు .

అనంతరం ఉదయం 11.10 గంటలకు హెలికాఫ్టర్ లో ఏలూరు సి.ఆర్ రెడ్డి  కళాశాలలో( Eluru in CR Reddy College ) ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు.ఉదయం 11.25 గంటలకు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించనున్నారు.11.45 కు సి ఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంకు చంద్రబాబు చేరుకుంటారు.అక్కడ రైతులు , వరద బాధితులతో స్వయంగా చంద్రబాబు మాట్లాడుతారు.ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 కి సిఆర్ రెడ్డి కళాశాల హెలి ఫ్యాడ్ కు చేరుకుని హెలికాప్టర్ లో సామర్లకోటకు చేరుకుంటారు.సామర్లకోట లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Advertisement

  ఈ సందర్భంగా ఏలూరు ఆధునికరణ పై తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబు రివ్యూ సమావేశం నిర్వహిస్తారు.

వరుణ్ తేజ్, సూర్యలకు భారీ షాకులు.. కథల ఎంపికలో తప్పులు చేస్తే ఫ్లాప్ తప్పదా?
Advertisement

తాజా వార్తలు