బాబు కి పెద్ద ఇబ్బందే వచ్చిందే ? వారైనా బాబు మాట వింటారా ?

తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కి పెద్ద కష్టమే వచ్చి పడింది.

టిడిపిని 2024 ఎన్నికల్లో ఏ విధంగా అధికారంలోకి తీసుకు రావాలి అనే విషయం పైన ప్రధానంగా దృష్టి పెట్టారు.

దానికి సంబంధించిన కసరత్తు గట్టిగానే చేస్తున్నారు.వీలైనంత వరకు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ,  వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Chandrababu TDP Vs Ysrcp Jagan TDP MLAs , Ap Budget , Chandrababu , TDP , Ja

అయితే ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావించి వైసిపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి ఏడో తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

 ఈ సమావేశాల్లోనే అనేక ప్రజా సమస్యలను ప్రస్తావించి , టిడిపి పై పైచేయి సాధించే ఛాన్స్ అయితే వచ్చింది.కాకపోతే కొద్ది నెలల క్రితం అసెంబ్లీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు తాను అసెంబ్లీ లో అడుగు పెట్టేదే లేదని చంద్రబాబు శపథం చేశారు.

Advertisement

మరికొద్ది రోజుల్లో జరగబోయే ఏపీ ఈ బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారింది.అయితే చంద్రబాబు మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానని,  పార్టీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఈ సమావేశాలకు హాజరై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని,  ఒకవేళ మాట్లాడే అవకాశం ప్రభుత్వం ఇవ్వకపోతే,  దీనిపైన రచ్చ చేయాలని బాబు సూచిస్తున్నారట.

కానీ టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని, బాబుకు తేల్చి చెప్పేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు