మండలంలో కారు జోరు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలం మొదటి నుండీ కాంగ్రేస్ పార్టీకి కంచుకోటగా ఉండేది.

ఈ మండలంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి,ఎంపీటీసీలను గెలుచుకుని సత్తా చాటిన కాంగ్రేస్,సొసైటీ ఎన్నికల్లో కొద్దిలో సొసైటీ చైర్మన్ ని కోల్పోయింది.

కానీ,కాంగ్రెస్ ఎంపీపీ,జెడ్పిటిసిని కైసవం చేసుకుంది.అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోతూ ప్రజల్లో పలుచని కావడంతో టిఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చింది.

ఇదిలా ఉంటే హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత టిఆర్ఎస్ పార్టీ పాలకవీడు మండల అధ్యక్షులుగా బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఉండడం,ఆయన పదవీ కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ల పంపిణీలో పక్షపాతం వహిస్తూ పార్టీ బలోపేతంలో చురుకైన పాత్ర పోషించకపోవడంతో అధిష్టానం రెండేళ్ల పదవీకాలం పేరుతో పక్కన పెట్టింది.అనంతరం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం,మండలంలోని కోమటికుంట గ్రామాన్ని దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం కొత్త నేతకు కలిసొచ్చింది.

దళితబంధు యానిట్ల పంపిణీలో ఆయన సమర్థవంతంగా పని చేయడం,ప్రభుత్వ పథకాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో ఇక్కడ ప్రతిపక్షాలకు పని లేకుండాపోయింది.దీనితో ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన కాంగ్రేస్ చరిత్ర నెమ్మదిగా మసకబారి పోయి,టిఆర్ఎస్ వేగంగా బలం పుంజుకుంటుంది.

Advertisement

గ్రామాలలో గులాబీ ముఖ్య నాయకుల,మాజీల చిల్లర చేష్టలతో గుబులు మండలంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న కారు జోరుకు ముఖ్యనాయకులు,మాజీలు కొంత అడ్డంకిగా మారారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.పాలకవీడు మండలం కృష్ణానదీ పరివాహక ప్రాంతం కావడంతో గూడేలు,తండాలు అధికంగా ఉన్నాయి.

అమాయక ప్రజల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అధికార టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,మాజీలు కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్,ఉపాధి హామీ పథకం వంటి వాటిల్లో తలదూరుస్తూ,ప్రజలకు సమస్యలు సృష్టిస్తూ,అధికారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కోమటికుంట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం టిఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ నింపుతోంది.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మండల అధ్యక్షుడు అయిన నాటి నుండి అన్ని రకాల కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండటం,పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో పార్టీ మరింత బలోపేతం అయినట్లుగా తెలుస్తోంది.అయితే అప్పటికే పార్టీలో ఉన్న లీడర్స్,క్యాడర్స్ కొత్త నేతల తీరుతో కొంత పరేషాన్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా కొత్త,పాత కలయికతో కారు లోడు పెరిగి,బయటికి బాగానే కనిపిస్తున్నా లోలోన వర్గపోరుతో రుసరుసలు ఉన్నాయనేది పార్టీలో టాక్.

సోషల్ మీడియాపై నిఘా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Advertisement

Latest Suryapet News