ఒకే పరీక్షలో ఆలిండియా టాపర్స్ గా నిలిచిన ట్విన్ సిస్టర్స్.. ఈ ట్విన్ సిస్టర్స్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

సివిల్స్ పరీక్ష( Civils Exam ) తర్వాత ఆ స్థాయిలో కష్టమైన పరీక్ష ఏంటనే ప్రశ్నకు సీఏ( CA ) పరీక్ష అనే సమాధానం వినిపిస్తుంది.

సీఏ పరీక్షలో టాపర్ గా నిలవడం సులువైన విషయం కాదు.

అయితే సంస్కృతి,( Sanskruti ) శృతి ( Shruti ) అనే ట్విన్ సిస్టర్స్ మాత్రం ఎలాంటి పరీక్షలు రాసినా సులువుగా మంచి ర్యాంక్ సాధించగలరు.ముంబైకు చెందిన ఈ ట్విన్ సిస్టర్స్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.22 సంవత్సరాల వయస్సులో సంస్కృతి, శృతి సీఏ ఫైనల్ పరీక్షలు రాయడంతో పాటు ఆ పరీక్షల్లో టాప్ 10 ర్యాంకుల జాబితాలో చోటు సంపాదించుకోవడం గమనార్హం.ఈ పరీక్షలో సంస్కృతి రెండో ర్యాంక్ సాధించగా శృతి ఎనిమిదో ర్యాంక్ సాధించింది.

పరీక్షలు అంటే ఈ ట్విన్ సిస్టర్స్ అస్సలు భయపడరని సమాచారం అందుతోంది.పరీక్షలను ఇష్టపడి రాసే ఈ ట్విన్ సిస్టర్స్ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

బ్యాడ్మింటన్ ను ఈ ట్విన్ సిస్టర్స్( Twin Sisters ) ఇష్టంగా ఆడతారని కొరియన్ సినిమాలు చూడటం కూడా ఈ సిస్టర్స్ కు ఎంతో ఇష్టమని తెలుస్తోంది.ఈ ట్విన్ సిస్టర్స్ కుటుంబానికి మరో ప్రత్యేకత కూడా ఉంది.ఈ ట్విన్ సిస్టర్స్ అన్నయ్య, వదిన, నాన్న కూడా సీఏ కావడం వీరికి మరింత ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

నాన్న, అన్నయ్య ప్రిపరేషన్ లో హెల్ప్ చేశారని ఈ ట్విన్ సిస్టర్స్ చెబుతున్నారు.

పోటీ పరీక్షలలో సక్సెస్ సాధించాలంటే సరైన సపోర్టింగ్ సిస్టమ్ అవసరం అని సంస్కృతి, శృతి పేర్కొన్నారు.సంస్కృతి, శృతి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సంస్కృతి, శృతి మరిన్ని విజయాలను అందుకుని ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంస్కృతి, శృతి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు