మావోయిస్టుల బంద్( Maoist bandh ) పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఇటీవల వరుసగా ఎన్ కౌంటర్లకు నిరసనగా మావోయిస్టులు ఇవాళ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.ఈ క్రమంలోనే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో( Bhadradri Kothagudem ( భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు.దాంతోపాటు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఆంధ్రా, ఒడిశా మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలెర్ట్ జారీ అయిందని తెలుస్తోంది.అయితే ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇవాళ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏజెన్సీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.