ఏపీ సీఎంపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.రాష్ట్రానికి సీఎం ముఖ్యమంత్రి అయినా కూడా అన్ని విషయాలు కూడా కేసీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు జరుగుతున్నాయి అంటూ ఎద్దేవ చేశాడు.
ప్రతి విషయంలో కూడా కేసీఆర్ సలహాలు మరియు సూచనలు తీసుకునే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ బైరెడ్డి కామెంట్స్ చేశాడు.జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి రాష్ట్రంలో అనిశ్చితికర పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ బైరెడ్డి విమర్శలు గుప్పించాడు.
ఏపీ ప్రజల అభిమానం దెబ్బ తీసిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌కు మార్గదర్శి అయ్యాడు అని, ఆయన వల్లే ఏపీలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటూ అసహనం వ్యక్తం చేశాడు.ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ జగన్ తన పరిపాలన కొనసాగించాల్సిందిగా బైరెడ్డి విజ్ఞప్తి చేశాడు.