ఈ దెబ్బతో వైకాపా బీజేపీ రహస్య స్నేహం బయట పడటం ఖాయం

ఏపీ శాసన మండలి రద్దుకు సంబంధించిన అసెంబ్లీ తీర్మానంను పార్లమెంటుకు నేరుగా బీజేపీ తీసుకు వెళ్లినట్లయితే వైకాపాతో రహస్య సంబంధాలను ఆ పార్టీ కలిగి ఉందని నిర్థారణకు రావచ్చు అంటూ తెలుగు దేశం పార్టీ ఎంపీ నాని అన్నారు.

ప్రస్తుతం కేంద్రం వద్ద రాష్ట్రాలకు చెందిన పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి.

అవన్నీ కూడా స్టాండింగ్‌ కమిటీ వద్ద ఉన్నాయి.మండలి రద్దుకు చెందిన తీర్మానం కూడా స్టాండింగ్‌ కమిటీ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.

స్టాండింగ్‌ కమిటీ వద్దకు వెళ్లకుండా నేరుగా బీజేపీ పార్లమెంటులో మండలి రద్దు బిల్లును కనుక ప్రవేశ పెడితే ఖచ్చితంగా వైకాపాతో ఒప్పందాలు చేసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని, ఈ దెబ్బతో వైకాపా మరియు బీజేపీల మద్య ఉన్న వ్యవహారం ఏంటో బయటకు వచ్చేస్తుంది అంటూ ఎంపీ నాని అన్నాడు.మండలి రద్దు విషయమై జగన్‌ తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తాం, అలాగే మోడీని కూడా కలిసి ఈ విషయమై మాట్లాడతాం అంటూ ఎంపీ నాని అన్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు