ఆదర్శం : బస్‌ కండక్టర్‌ సివిల్స్‌ మెయిన్స్‌ క్లియర్‌ చేశాడు

చదువుకోమంటూ లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారు.

కాని పిల్లలు మాత్రం అల్లరి చిల్లర వేషాలు వేస్తూ చదువు పక్కన పెట్టి స్నేహితులతో బలాదూర్‌ తిరుగుతున్నారు.

డబ్బు పెట్టించి చదివించకున్నా కూడా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ ఉన్నత విధ్యలు అభ్యసించే వారు చాలా మంది ఉన్నారు.కొందరికి ఆర్థిక పరిస్థితి బాగుంటే చదువుకునే ఆసక్తి ఉండదు, కొందరు ఆర్థిక పరిస్థితి బాగా లేక చదువు వదిలేసిన వారు ఉన్నారు.

రెండవ కేటగిరికి చెందిన వ్యక్తి మధు.కర్ణాటకకు చెందిన మధు ఇంటర్‌ పూర్తి అయిన వెంటనే తన 19వ ఏటనే బస్సు కండక్టర్‌గా జాయిన్‌ అయ్యాడు.

గత పది సంవత్సరాలుగా ఆయన ఉద్యోగం చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు.కాని అతడు ఉద్యోగం చేయడంతో పాటు గ్రాడ్యుయేషన్‌ మరియు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ను కూడా డిస్టెన్స్‌లో పూర్తి చేశాడు.ఇక్కడి వరకు ఈయన్ను గొప్ప వ్యక్తి అనవచ్చు.

Advertisement

కాని ఇప్పుడు ఇతడు సాధించిన గొప్ప విషయాన్ని చెప్తే అతడిని పొగిడేందుకు మాటలు రావు.ఎందుకంటే లక్షలు ఖర్చు చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేవారు ఉన్నారు.

అలాంటి వారు కూడా ప్రిలిమ్స్‌ మరియు మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యేందుకు నానా కష్టాలు పడుతుంటారు.కాని ఈయన మాత్రం గత ఏడాది జూన్‌లో ప్రిలిమిమ్స్‌ క్వాలిఫై అయ్యాడు.

మొన్న వచ్చిన మెయిన్స్‌ రిజల్ట్‌లో కూడా క్వాలిఫై అయ్యాడు.

మార్చిలో ఈయన సివిల్స్‌ ఇంటర్వ్యూకు సిద్దం అవుతున్నాడు.ఒక బస్సు కండక్టర్‌ సివిల్స్‌ మెయిన్స్‌ క్వాలిఫై అవ్వడం మామూలు విషయం కాదు.ఇతడి కృషి పట్టుదలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
సుకుమార్ ఇక మీదట చేసే మూవీస్ పుష్ప 2 కి మించి సినిమాను చేయాల్సిన అవసరం ఉందా..?

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ క్వాలిఫై అయిన సందర్బంలో స్నేహితులు ఇంతటితో ఆపు అన్నట్లుగా గేలి చేశారు.కాని అతడు మాత్రం నిరాశ పడకుండా మెయిన్స్‌కు చాలా పట్టుదలతో చదివాడు.

Advertisement

అతడు ప్రస్తుతం దేశంలోని యువత అందరికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు.

మధు మాట్లాడుతూ.నేను డ్యూటీ చేయడంతో పాటు ప్రతి రోజు అయిదు గంటల పాటు చదువుతూ ఉంటాను.నేను రోజుకు 5 గంటల చదువుతో మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యాను అంటూ చెబుతున్నాడు.

నా తల్లిదండ్రులకు నేను ఏం పాస్‌ అయ్యానో తెలియదు.కాని వారు నా వల్ల చాలా సంతోషంగా ఉన్నారు.

నేను భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలను సాధిస్తాను అనే నమ్మకంగా ఉన్నానంటూ మధు చెప్పుకొచ్చాడు.చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉండి ఇతడు ఇంతగా చదువుతాడా అనుకుంటారు.

కాని చదువు అనేది మొహంలో తెలియదు అని మధు నిరూపించాడు.

తాజా వార్తలు