నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన బి టి ఆర్ ఫౌండేషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండల( Ellantakunta ) గాలిపెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కట్కూర్ రాజవ్వ ఆకస్మికంగా మరణించటంతో వారి సభ్యులను పరామర్శించి 50 కేజీ ల బియ్యం అందించారు.

అలాగే ముస్కాన్ పేట గ్రామంలో జుట్టు మల్లవ్వ ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీ ల బియ్యం అందించారు.

అలాగే ఇల్లంతకుంట గ్రామంలోని పొన్ను స్వామి గుండెనొప్పితో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీ ల బస్తాలను బిటిఆర్ ఫౌండషన్( BTR Foundation ) ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ .ఇల్లంతకుంట మండలంలోని నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై బిటిఆర్ ఫౌండేషన్ మీకు అండగా వుంటుందాన్నరు.పేద కుటుంబాలకు ఎల్లపుడు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమం లో బి.టీ.ఆర్ ఫౌండేషన్ సేవాప్రతినిధులు బండారి రాజు, పోతురాజు పర్శరాములు, కోమటిరెడ్డి అనిల్,కేశవేణి భూమేష్, బట్టు.మల్లేశం, దురశెట్టి లింగం, చింటూ, పొన్ను శ్రీను, పొన్ను నాంపల్లి, లచ్చవ్వ, నర్సయ్య, బాబు, నందు,తదితరులు పాల్గొన్నారు.

రాజన్న ఆలయ 26 రోజుల హుండీ ఆదాయం
Advertisement

Latest Rajanna Sircilla News