సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడంతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆవిర్భావ సభ జరగనుంది.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు.ఆవిర్భావ సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.21 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం ముగియనుండగా జాతీయ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి ప్రయాణం ప్రారంభం కానుంది.అదేవిధంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో బీఆర్ఎస్ నినాదంతో పాటు జెండాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు జై భారత్ నినాదం ఎంచుకుంటారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.తెలంగాణ మ్యాప్ బదులుగా భారత చిత్రపటం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు