ఘనంగా ముగిసిన యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ముగిశాయి.ఈ శుభ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మన తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనర సింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి.ఫిబ్రవరి 21వ తేదీన స్వస్తివచనంతో మొదలైన ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులు పాటు కొనసాగాయి.

శుక్రవారం రోజు రాత్రి శృంగార డోలోత్సవంతో ఈ కార్యక్రమలు ముగిసిపోయాయి.శుక్రవారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా వజ్రవైఢూర్యాలతో అలంకరించారు.

Yadadri Srilakshmi Narasimha Swami Annual Brahmotsavalu Ended,yadadri Srilakshmi

ఈ వేడుక కోసం దేవాలయ ప్రకార మండపం పూలతో అలంకరించారు.ఆ తర్వాత అద్దాల మండపంలోని ఉయ్యాలలో స్వామివారిని ఉంచారు.ఆ తర్వాత దేవాల అర్చకులు వేదమంత్రాల, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించి, వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు.

Advertisement
Yadadri Srilakshmi Narasimha Swami Annual Brahmotsavalu Ended,Yadadri Srilakshmi

వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుకలు డోలోత్సవ వేడుకానీ అర్చకులు వెల్లడించారు.

Yadadri Srilakshmi Narasimha Swami Annual Brahmotsavalu Ended,yadadri Srilakshmi

ఈ కార్యక్రమం విశిష్టతను భక్తులకు తెలియజేశారు.హైదరాబాద్ కు చెందిన కొందరు భక్తులు స్వామి వారిని కీర్తిస్తూ పాటలు పాడి భక్తులను మైమరిపించారు.వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయం ఎదుర్కోలు కార్యక్రమం, స్వామి వారి రథోత్సవం ఇలా రోజుకు కార్యక్రమం నిర్వహించారు.అయితే అర్చకులు భక్తులకు స్వామివారి అవతారం వారి విశిష్టతను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా హాజరయ్యారు.స్వామి వారి కల్యాణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి పాల్గొన్నారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

ఈ పుణ్య కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ముగియడంతో దేవాలయ అధికారులు ఊపిరిపించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు