గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.తాజాగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ సోదరుడు శైలీందర్ సింగ్ మృతిచెందాడు.
అపార్ట్ మెంట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో గుండెపోటు రావడంతో శైలీందర్ సింగ్ ఒక్కసారిగా కుప్పకూలారు.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
హార్ట్ ఎటాక్ తో చనిపోయే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.







