నన్ను అన్యాయంగా తొలగించారు : సింగపూర్ సంస్థ జిలింగో‌పై భారత సంతతి ఎగ్జిక్యూటివ్ ఆరోపణలు

సింగపూర్‌కి చెందిన కంపెనీ జిలింగోపై ఆ సంస్థ మాజీ సీఈవో , భారత సంతతికి చెందిన అంకితి బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఈవో పదవి నుంచి తనను తప్పించడం అక్రమమని ఆమె మండిపడ్డారు.

తాను లేవనెత్తిన అంశాలను పూర్తిగా పరిష్కరించడానికి తనకు అవకాశం ఇవ్వకుండా .‘‘అవిధేయత’’ అన్న కారణంగా బోర్డు తనను అన్యాయంగా తొలగించిందని అంకితి బోస్ రాయిటర్స్‌కి రాసిన ఈమెయిల్‌లో ఆరోపించారు.కంపెనీలో గత కొన్నేళ్లుగా తాను ఎదుర్కొన్న వేధింపులు, ఒత్తిడికి సంబంధించి ఈ వారం బోర్డుకు సవివరంగా తెలియజేశానని అంకితి వాపోయారు.

తీవ్రమైన ఆర్దిక అవకతవకలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు రావడం, ఫోరెన్సింగ్ ఆడిట్ తర్వాత అంకితి బోస్‌ను సీఈవో పదవి నుంచి తప్పించినట్లు సింగపూర్‌కి చెందిన ఫ్యాషన్ టెక్నాలజీ స్టార్టప్ జిలింగో‌ శుక్రవారం వెల్లడించింది.మార్చి 31న కంపెనీ ఖాతాల్లో వ్యత్యాసాలు వున్నట్లు ఫిర్యాదులు రావడంతో అంకితిని సస్పెండ్ చేశారు.

అనంతరం ఫోరెన్సిక్ ఆడిట్ కోసం డెలాయిట్, క్రోల్‌లను కంపెనీ నియమించింది.

Advertisement

స్వతంత్ర ఫోరెన్సిక్ సంస్థ నేతృత్వంలోని దర్యాప్తు తర్వాత కంపెనీ.అంకితి బోస్‌ను సీఈవోగా తప్పించింది.అయితే ఆమెపై వచ్చిన ఆరోపణలను కానీ, ఆడిట్‌లో కనుగొన్న విషయాలను గానీ జిలింగో వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలోనే అంకితి బోస్ స్పందించారు.తన తొలగింపునకు సంబంధించి క్రోల్, డెలాయిట్ సంస్థల దర్యాప్తు వివరాలను సమర్పించలేదని, అలాగే ఆ నివేదికలు అసంపూర్ణంగా వున్నాయన్నారు.

డెలాయిట్‌ను బోస్ వేధింపుల దావాపై విచారణ చేయాల్సిందిగా కోరామని, అలాగే ఆమె ఆర్ధిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిందిగా క్రోల్‌ను కోరినట్లు ఈ పరిణామాలపై అవగాహన వున్న వ్యక్తులు రాయిటర్స్‌కు తెలియజేశారు.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు