సీతా రామన్ బదులు సురేష్ ప్ర‌భుకు ఛాన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్ధిని రాజ్యసభకు పంపేందుకు సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.

తిరుపతిలో జరిగిన తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జ‌రుగుతున్న స‌మ‌యంలో భాజ‌పా జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఫోన్‌లో ఈ విష‌య‌మై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు అవకాశమివ్వడంతో ఇక మూడు సీట్లు తెలుగుదేశంవే అన్న ఊహాగానాలతో ఆశావాహులు పెరిగారు.అయితే నిర్మలాసీతారామన్ స్ధానంలో భాజపా నేత, కేంద్రమంత్రి సురేశ్‌ప్రభుకు అవకాశమివ్వాల‌ని అమిత్ షా కోర‌టంతో చంద్ర‌బాబు త‌లూప‌క త‌ప్పింది కాద‌న్న‌ది దేశం వ‌ర్గాల స‌మాచారం.

ఈమేర‌కు పోలిట్ బ్యూరోలో సురేశ్‌ ప్రభుకు సీటు కేటాయింపు విష‌యాన్ని చంద్రబాబు ప్ర‌స్దావిస్తూ, భ‌విష్య అవ‌స‌రాల దృష్ట్యా అమిత్ షా విన‌తిని మ‌న్నించాల్సి ఉంటుంద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, పురంద‌రేశ్వ‌రి గూఢ‌చ‌ర్యం న‌డుపుతూ సోనియాకు విష‌యాలు చేరుస్తున్న విష‌యాన్ని అమిత్ షా అర్ధం చేసుకున్నార‌ని, తెదేపా, భాజపా పొత్తుకు గండీ కొట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగానే కొంద‌రు నేత‌ల‌ని త‌మ పార్టీలో చేర్పించింద‌న్న‌త‌మ వాద‌న‌లో బ‌ల‌ముంద‌ని దేశం వ‌ర్గాలు చెప్తూ, ఏపీ నుంచి భాజపా తరఫున కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభును పేరును భాజపా అధిష్ఠానం సూచించించ‌డం త‌మ‌తో మైత్రిని కొన‌సాగించేందుకేన‌ని వ్యాఖ్యానిస్త‌న్నారు.

సీతా రామన్ బదులు సురేష్ ప్ర‌భుకు ఛాన్స్‌.

Advertisement
మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!

తాజా వార్తలు