వైసీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శనాస్త్రాలు

వైసీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహనరావు విమర్శలు గుప్పించారు.వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తెలిపారు.

కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ చేతకాని తనాన్ని బయటపెడుతున్నారని జీవీఎల్ విమర్శించారు.విజయవాడ, విశాఖ మెట్రో గురించి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

కేంద్రంపై నిందలు వేస్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందన్నారు.రాష్ట్రానికి టీడీపీ, వైసీపీ ద్రోహం చేశాయని తెలిపారు.

జనసేన, బీజేపీ ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.ఏపీలో జనసేన, బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

రాష్ట్రంలో ఎవరినో సీఎంను చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు