పంచాయతీ కార్యదర్శులకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం( Konaraopet Mandal ) లో గత ఏడు రోజులుగా పంచాయతీ జూనియర్ కార్యదర్శులు చేస్తున్నటువంటి నిరవదిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ తరఫున సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు( BJP Leaders ) మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి శ్రమ ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో అవార్డులు రావడం జరిగిందన్నారు.

గ్రామీణ ప్రాంతంలో పచ్చదనం పారిశుధ్యం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందించన పంచాయతీ జూనియర్ కార్యదర్శుల 4 సంవత్సరాల సర్వీస్ ను లెక్కలోకి తీసుకొని రెగ్యులరైజ్ చేయాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

Latest Rajanna Sircilla News