TDP: టిడిపి తో పొత్తు .. వేచి చూసే ధోరణిలో బీజేపీ ?

ఏపీలో బిజెపి రాజకీయంగా వేసే అడుగుల పై ఇంకా ఏ క్లారిటీ రావడం లేదు.

పొత్తు విషయమై చర్చించేందుకు టిడిపి అధినేత చంద్రబాబును( Chandrababu ) ఢిల్లీకి రావలసిందిగా ఆహ్వానించిన బిజెపి దానికి సంబంధించిన చర్చలను పూర్తి చేసింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ) తో టిడిపి అధినేత చంద్రబాబు భేటీ అయ్యి పొత్తుల అంశంపై చర్చించారు.ఇప్పటికే జనసేన, బిజెపి లు పొత్తు కొనసాగిస్తున్నాయి.

సీట్ల సర్దుబాటు విషయంలో కీలక ప్రకటన చేసే సమయంలోనే బిజెపి నుంచి పిలుపు రావడంతో చంద్రబాబు హుటా హుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లి అమిత్ షా తో చర్చించారు.ఇక తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సైతం ఢిల్లీకి వెళ్లడం, అదే సమయంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కావడం, ఇటీవల ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల పైన చర్చించడం వంటివి జరిగాయి ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు పొత్తుల అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.

దేశ రాజకీయాలు, వేరువేరు రాష్ట్రాల్లో పొత్తుల అంశంపై స్పందించిన అమిత్ షా ఏపీలో పొత్తులపై ఇప్పటికిప్పుడు ఏమి మాట్లాడలేము అంటూ వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ఎదురుచూపులు చూస్తున్న టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.ప్రస్తుతం జనసేన, టిడిపిలు( Janasena , TDP ) సీట్ల పంపకాలపై ఒక క్లారిటీకి వచ్చిన తరువాత బిజెపి నుంచి కబురు రావడం, పొత్తుల అంశంపై చర్చించిన తరువాత ఈ ప్రకటన చేయడంతో, మరికొంత కాలం బిజెపి వేచి చూసే ధోరణి అవలంబించబోతోంది అనే విషయం అర్థమవుతుంది.

Advertisement

దీంతో సీట్ల సర్దుబాటు, పొత్తుల విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.బిజెపిని కాదని టిడిపి ,జనసేన పార్టీలు సీట్ల పంపకాలు చేపడితే, బీజేపీ అగ్రనేతల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయము చంద్రబాబును వెంటాడుతోంది.

దీంతో బిజెపి నిర్ణయం ఏమిటి అనేది క్లారిటీ వచ్చేవరకు టిడిపి, జనసేన సీట్ల పంపకాలు విషయంలో తొందరపడకూడదని, మరి కొంతకాలం వేచి చూస్తే మంచిదనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారట.ఏది ఏమైనా బిజెపి నిర్ణయం కోసం వేచి చూస్తున్న చంద్రబాబుకు అమిత్ షా వ్యాఖ్యలు మరింత టెన్షన్ కలిగిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు