Big Boss 6 Finale task : బిగ్ బాస్ హౌస్ లో వారిద్దరి మధ్య పోటీ.. ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే అప్పుడే క్లైమాక్స్ కు చేరుకుంది.

అయితే సీజన్ సిక్స్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులలో కూడా టెన్షన్ పెరుగుతోంది.

హౌస్ లో నుంచి ఎవరి ఎలిమినేట్ అవుతారు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అన్న విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఒకవేళ 13వ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే మరొక రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 కు కొబ్బరికాయ కొట్టి ముగింపు పలకడం ఖాయం.

అయితే బిగ్బాస్ తెలివిగా టికెట్టు ఫినాలే టాస్క్ లో భాగంగా ఏకాభిప్రాయం అంటూ హౌస్ మేట్స్ ను అడ్డంగా ఇరికిస్తున్నాడు.ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా కీర్తి, ఇనయా, శ్రీ సత్య అవుట్ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఐదుగురు మాత్రమే రేసులో ఉన్నారు.అయితే ఈ రేసులో చివరగా శ్రీహాన్ రేవంత్ మిగిలారు.

Advertisement

దీంతో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలయ్యింది.ఇద్దరూ కష్టపడి బాగానే ఆడినప్పటికీ ఈ టికెట్ టు ఫినాలే టాస్కులు శ్రీహన్ గెలిచినట్టు తెలుస్తోంది.

శ్రీహన్ టికెట్టు ఫినాలే గెలవకపోయినా టాప్ ఫైవ్ లో ఈజీగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇక ఇది ఇలా ఉంటే 21 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్గా మొదలైన బిగ్ బాస్ షోలో ప్రస్తుతం ఎనిమిది మంది కంటే సెంట్లు మాత్రమే ఉండగా ఇందులో ముగ్గురు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేస్తే కేవలం ఐదుగురు మాత్రమే టాప్ ఫైవ్ లో నిలవనున్నారు.

అయితే బిగ్బాస్ హౌస్ ముగింపు దశకు చేరుకుంటున్నాడంతో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి.మొన్నటివరకు రేవంత్ విన్నర్ గా గెలిచి ఇనయ రన్న రప్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు వినిపించాయి.కానీ బిగ్ బాస్ ఎపిసోడ్స్ పెరిగే కొద్దీ పరిస్థితులు తారిమారు అవుతున్నాయి.

అయితే మొత్తానికి ఈ సీజన్ విన్నర్ రేవంత్ అన్నది మాత్రం తేలిపోయింది.కానీ టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు రన్న రప్ గా ఎవరు నిలుస్తారు అన్నది తెలియడం కోసం బిగ్ బాస్ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు