భారీ ధరకు అమ్ముడుపోయిన భీమ్లా నాయక్ ఓటీటీ రైట్స్.. ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 25వ తేదీన  సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటించగా.

రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశారని సమాచారం.

Advertisement
Bheemla Nayak Ott Rights Sold To Huge Price Details, Bheemla Nayak, Tollywood,

ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారు వంద కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Bheemla Nayak Ott Rights Sold To Huge Price Details, Bheemla Nayak, Tollywood,

ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 45 రోజులకు ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ సోషల్ మీడియాలో ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.

ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.మరి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అంచనాలను చేరుకుంటారా లేదా అనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు