భీమ్లా నాయక్ పై రానా ఫ్యాన్స్ ఫైర్..!

మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాకు రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

పవన్, రానా కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ తో పాటుగా పవర్ స్టార్ ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.అయితే మల్టీస్టారర్ అనుకున్న ఈ సినిమాకు పవన్ పేరుని టైటిల్ గా పెట్టడం.

Rana Fans Fire On Bheemla Nayak First Glimpse,Bheemla Nayak First Glimpse, Bhee

ఫస్ట్ గ్లింప్స్ లో రానాని రివీల్ చేయకపోవడంపై దగ్గుబాటి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.దీనిపై భీమ్లా నాయక్ టీజర్ పై రానా ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మల్టీస్టారర్ అనుకున్న ఈ సినిమా సోలో హీరో మూవీ అయ్యిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

సినిమాకు సంబందించి ప్రతిదీ ఒక ఆర్డర్ లో జరుగుతుందని.దయచేసి కొద్దిగా వెయిట్ చేయండని అన్నారు.

మొత్తానికి భీమ్లా నాయక్ పై జస్ట్ ఫస్ట్ గ్లింప్స్ తోనే రానా ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు అంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక పవన్ ను ఓ రేంజ్ లో చూపించడం చూసి రానా ఫ్యాన్స్ తప్పకుండా హర్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు