మొదటి రోజు కంటే 6వ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన 'భగవంత్ కేసరి'..ఇది మామూలు మాస్ కాదు!

ఈ దసరా కి విడుదలైన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే.

విడుదలైన మూడు సినిమాలలో భగవంత్ కేసరి కి పాజిటివ్ టాక్ రాగా, తమిళ హీరో విజయ్ లియో( Leo movie ) కి డివైడ్ టాక్, అలాగే రవితేజ టైగర్ నాగేశ్వర రావు( Tiger Nageswara Rao ) చిత్రానికి యావరేజి టాక్ వచ్చింది.

మొదటి వీకెండ్ లో బాలయ్య మరియు రవితేజ సినిమాలకంటే లియో చిత్రానికి అత్యధిక వసూళ్లు వచ్చాయి.టాక్ పెద్దగా లేకపోయినా కూడా యూత్ ఆడియన్స్ లియో చిత్రం వైపే ఎక్కువ మొగ్గు చూపించారు.

కానీ నిన్న , ఈరోజు మాత్రం లియో చిత్రం మీద తెలుగు లో మిగిలిన రెండు సినిమాలు ఆధిపత్యం చూపించాయి.ముఖ్యంగా భగవంత్ కేసరి చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

నిన్న వచ్చిన భారీ వసూళ్లతో ఈ సినిమా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు 65 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.

Bhagavanth Kesari Box Office Collection Day 6 Details, This Is No Ordinary Mass
Advertisement
Bhagavanth Kesari Box Office Collection Day 6 Details, This Is No Ordinary Mass

మొదటి వీకెండ్ లో వచ్చిన వసూళ్లను చూసి భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) చిత్రానికి కనీసం 15 కోట్ల రూపాయిల నష్టం వస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఈరోజు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చేసి ట్రేడ్ పండితులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.చాలా చోట్ల మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ సినిమాకి సెన్సేషనల్ కలెక్షన్స్ వచ్చాయి.ముందస్తుగా ట్రేడ్ పండితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నేడు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

అలా ఓవరాల్ గా ఈ సినిమా నేటితో 50 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అధిగమించబోతుందని అంటున్నారు.బ్రేక్ ఈవెన్ కి ఇక కేవలం 15 కోట్ల రూపాయిలు మాత్రమే ఉంది.

ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో దసరా పక్క రోజు కూడా దాదాపుగా సెలవు దినం లెక్కనే.

Bhagavanth Kesari Box Office Collection Day 6 Details, This Is No Ordinary Mass
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

కాబట్టి రేపు కూడా ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇక మిగిలిన 13 కోట్ల రూపాయలలో మరో 5 కోట్ల రూపాయిలు ఈ వీకెండ్ లో వస్తుందని, ఫుల్ రన్ లో మరో రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.అలా ఓవరాల్ గా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని, వర్కింగ్ డేస్ లో కాస్త డీసెంట్ హోల్డ్ ని రప్పించుకోగలిగితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Advertisement

చూడాలి మరి వారి అంచనాల ప్రకారం ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

తాజా వార్తలు