క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలా? అయితే ఈ న్యాచుర‌ల్ క్రీమ్ మీకే!

క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు.ఈ స‌మ‌స్య‌ను స్త్రీలు మాత్ర‌మే కాదు చాలా మంది పురుషులు సైతం ఫేస్ చేస్తున్నారు.

చ‌ర్మం తెల్ల‌గా, మృదువ‌గా, అందంగా ఉన్న‌ప్ప‌టికీ.క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఉంటే అందవిహీనంగా క‌నిపిస్తారు.

అందుకే క‌ళ్ల కింద ఏర్ప‌డిన న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే క‌ళ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డ‌టానికి చాలా కార‌ణాలే ఉన్నాయి.

ముఖ్యంగా అధిక ఒత్తిడి, పోష‌కాల కొర‌త‌, రక్త ప్రసరణలో లోపం, ఓవ‌ర్‌గా స్మార్ట్ ఫోన్స్ వాడ‌టం వ‌ల్ల న‌ల్ల‌టి వ‌ల‌యాలు వ‌స్తుంటాయి.

Natural Cream, Dark Circles Under Eyes, Dark Circles, Eyes, Skin Care, Skin Car
Advertisement
Natural Cream, Dark Circles Under Eyes, Dark Circles, Eyes, Skin Care, Skin Car

అలాగే కెమిక‌ల్స్ ఎక్కువ‌గా మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, ఎండలు ఎక్కువ సేపు ఉండ‌టం, హర్మోన్లలో మార్పులు, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, శ‌రీరంలో వేడి వంటి కార‌ణాల వ‌ల్ల కూడా క‌ళ్ల కిండ భాగంగా న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఏర్ప‌డుతుంటారు.అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.ఇప్పుడు చెప్ప‌బోయే ఓ న్యాచుర‌ల్ క్రీమ్‌ను మూజ్ చేస్తే గనుక చాలా స‌ల‌భంగా మ‌రియు వేగంగా న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ న్యాచుర‌ల్ క్రీమ్ ఏంటీ.? ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ప‌ది బాదం ప‌ప్పుల‌ను తీసుకుని వాట‌ర్‌లో వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాన బెట్టుకున్న‌ బాదం ప‌ప్పుల‌ను పొట్టు తీసేసి వేసుకోవాలి.ఇప్పుడు ఇందులో అర క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసి బాగా మెత్త‌గా పేస్ట్ చేసి.

ఆపై బాదం పాల‌ను వేరు చేసుకోవాలి.

Natural Cream, Dark Circles Under Eyes, Dark Circles, Eyes, Skin Care, Skin Car
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
మా ఇంట్లో వారే అలాంటి  పక్షపాతం చూపేవారు... ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ!

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బాదం పాలు, ఒక స్పూన్ కీర దోస జ్యూస్‌, రెండు స్పూన్ల‌ అలోవెర జెల్‌, చిటికెడు కాఫీ పౌడ‌ర్‌, రెండు విట‌మిన్ ఇ క్యాప్సిల్స్‌ ఆయిల్ వేసుకుని బాగా క‌లిసేలా మిక్స్ చేసుకుంటే మ‌న సూప‌ర్ సింపుల్ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.ఈ క్రిమ్‌ను ఒక చిన్న డ‌బ్బాలో వేసుకుని ఫ్రీజ్‌లో స్ట్రోర్ చేసుకోవాలి.ఇక ప్ర‌తి రోజు నిద్రించే ముందు ఈ న్యాచుర‌ల్ క్రీమ్‌ను క‌ళ్ల కింద అప్లై చేసుకుని.

Advertisement

ఉద‌యాన్నే కూల్ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.త‌ద్వారా కొద్ది రోజుల్లోనే న‌ల్ల‌టి వ‌ల‌యాలు దూరం అవుతాయి.

తాజా వార్తలు