ఈ ఒక్క రెమెడీతో వయసును దాచేయవచ్చు.. య‌వ్వ‌నంగా మెరిసిపోవచ్చు!

వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు( Aging Skin ) ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించడం సహజం.

కానీ కొందరు మాత్రం 60 లోనూ చాలా యంగ్ గా కనిపిస్తూ అబ్బురపరుస్తుంటారు.

అలాంటి వారిని చూస్తే ఎంతోకొంత అసూయ పుడుతుంటుంది.అలా మేము ఎందుకు లేము అని కాస్త బాధపడుతుంటారు.

కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.వయసు పై పడిన సరే యవ్వనంగా మెరుస్తుంది.

ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

ఈ రెమెడీతో వయసును దాచేయవచ్చు.యవ్వనంగా మెరిసిపోవచ్చు.ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ) వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో ఉడికించిన మిశ్రమం నుంచి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక చిన్న బీట్ రూట్( Beetroot ) ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆపై మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, ఒక కప్పు రోజ్ వాటర్ వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్టు లో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement

రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే చర్మం టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.ముడతలు చారలు ఇతర వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వయసు పెరిగిన సరే చర్మం యవ్వనంగా ఆకర్షణీయంగా మెరుస్తుంది.కాబట్టి వయసు పైబ‌డిన యంగ్ గా మెరుస్తూ కనిపించాలని కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు