బీట్‌రూట్‌ను ఇలా తీసుకుంటే..బ్రెయిన్ షార్ప్ అవ్వాల్సిందే!

మెద‌డు ప‌ని తీరు నెమ్మదించిన‌ప్పుడు. జ్ఞాప‌క శ‌క్తి మంద‌గిస్తుంది.

మ‌రియు ఆలోచించే శ‌క్తి కూడా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

కానీ, ప్ర‌స్తుత‌ పోటీ ప్ర‌పంచంలో బ్రెయిన్ షార్ప్‌గా ఉండ‌టం చాలా అవ‌స‌రం.

అలా ఉంటేనే ఈ ప్ర‌పంచంతో పోరాడ‌గ‌లం, గెల‌వ‌గ‌లం.అయితే మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డాలంటే.

నిత్యం యోగా, ధ్యానంలతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు తీసుకుంటే మెద‌డు సూప‌ర్ షార్ప్‌గా ప‌ని చేస్తుంది.

Advertisement

అలాంటి వాటిలో బీట్ రూట్ ఒక‌టి.బీట్ రూట్‌ను చాలా మంది డైరెక్ట్‌గా తీసుకోలేరు.

అలాంటి వారు బీట్ రూట్‌ను స‌లాడ్ రూపంలో తీసుకోవ‌డం మంచిదంటున్నారు.ముందు బీట్ రూట్ యొక్క పీల్ తీసేసి శుభ్రం చేసుకోవాలి.

ఇప్పుడు వాట‌ర్‌లో బీట్ రూట్‌ చిటికెడు ఉప్పు వేసి ఉడికించుకోవాలి.ఆ త‌ర్వాత ఉడికిన బీట్ రూట్‌ను క‌ట్ చేసి.

అందులో ఉల్లిపాయ ముక్క‌లు, ఆలివ్ ఆయిల్, వెనిగర్‌తో పాటు చిటికెడు ఉప్పు చ‌ల్లితే స‌రిపోతుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
యూఎస్ ఆర్మీలోని ట్రాన్స్‌జెండర్స్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం?

బీట్ రూట్ స‌లాడ్‌ను ప్ర‌తి రోజు లేదా రెండు రోజుల‌కు ఒక సారి తీసుకోవ‌డం వ‌ల్ల‌.ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డేలా చేస్తుంది.ఆలోచ‌నా శ‌క్తితో పాటు జ్ఞాప‌క శ‌క్తిని కూడా రెట్టింపు చేస్తుంది.

Advertisement

ముఖ్యంగా ఎదిగే పిల్ల‌ల‌కు ఈ బీట్ రూట్ స‌లాడ్ పెడితే.వారి బ్రెయిన్ షార్ప్‌గా మారుతుంది.

ఇక బీట్ రూట్ ఇలా స‌లాడ్ రూపంలో తీసుకుంటే.బ‌రువు పెరుగుతార‌న్న భ‌యం కూడా ఉండ‌దు.

ఎందుకంటే, బీట్ రూట్ లో కేల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటుంది.అలాగే ఈ బీట్ రూట్ స‌లాడ్‌ను డైట్‌లో చేర్చుకుంటే.

శ‌క్తి పెరుగుతుంది.కొవ్వు క‌రుగుతుంది.

ర‌క్త హీనత‌ స‌మ‌స్య దూరం అవుతుంది.కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.

తాజా వార్తలు