వ‌ర్షాకాలంలో వేపాకును ఇలా వాడితే..మృదువైన చ‌ర్మం మీసొంతం!

సాధార‌ణంగా ఈ వ‌ర్షాకాలంలో చ‌ర్మం పొడి బారిపోతూ ఉంటుంది.అలాగే మొటిమ‌లు, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌లు కూడా అధికంగా వేధిస్తూ ఉంటాయి.

వీటిని నివారించుకుని.ముఖాన్ని తేమ‌గా, మృదువుగా మార్చుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు ఇలా ఎన్నో వాడుతుంటారు.

అయితే న్యాచుర‌ల్‌గా కూడా ముఖాన్ని మృదువుగా, కోమ‌లంగా మార్చుకోవ‌చ్చు.ముఖ్యంగా అందుకు వేప ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి వేపాకుల‌ను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ఫ్రెష్‌గా ఉండే వేపాకుల‌ను తీసుకుని బాగా ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఒక బౌల్‌లో వేపాకుల పొడి ఒక స్పూన్‌, ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ ఒక స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.

మొటిమ‌లు కూడా తగ్గుతాయి.అలాగే కొన్ని వేపాకులు తీసుకుని మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఇప్పుడు ఈ ర‌సంలో చంద‌నం పొడి వేసుకుని మిక్స్ చేసి.ముఖానికి, మెడ‌కు ప‌ట్టించాలి.

Advertisement

బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే.

ముడ‌త‌లు త‌గ్గి ముఖం కోమ‌లంగా మారుతుంది.

ఇక ఒక బౌల్‌లో కొద్దిగా నీటిని తీసుకుని.అందులో గుప్పెడు వేపాకులు వేసి బాగా మ‌రిగించాలి.ఆ త‌ర్వాత కాసేపు చ‌ల్లారిచ్చి పేస్ట్ చేసుకుని.అందులో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా డే బై డే చేస్తే.

పొడిగా ఉండే చ‌ర్మం తేమ‌గా మ‌రియు స్మూత్‌గా మారుతుంది.

తాజా వార్తలు