మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి-ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీకి చెందిన మేకల కాపరి ,గిరిజనుడయిన భూక్య నరేష్ నాయక్ ( 30 ) పై ఎలుగుబంటి దాడి చేసి గాయపరిచింది.

ఎలుగు బంటి దాడిలో నరేష్ నాయక్ ఎడమ చేతికి తీవ్ర గాయం అయింది.

గుంటపల్లి చెరువు తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలను మేపుతుండగా సమీపము లోని చెట్ల పొదలలో పిల్లల తో ఉన్న ఎలుగుబంటి ఒక్క సారిగా నరేష్ పై దాడి చేసింది.వెంటనే గమనించిన నరేష్ తన వద్ద ఉన్న గొడ్డలితో ఏలుగు బంటి పై ఎదురు దాడి కి దిగి తనకు తాను కాపాడు కోవడంతోప్రాణాపాయం తప్పింది.

ఎలుగు బంటూ దాడిలో గాయపడ్డ నరేష్ ను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ఎలుగుబంటి దాడి లో గాయపడిన నరేష్ నాయక్ ను ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత ఒకరి రిమాండ్..
Advertisement

Latest Rajanna Sircilla News