సోషల్ మీడియాలో వివాదంగా మారిన ఆ జంట కిస్సింగ్ ఫోటో.! ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు!

అప్పటివరకు కుండపోతగా కురిసిన వర్షం నెమ్మదిగా తగ్గుతోంది.చిటపట చినుకులు పడుతూ ఉన్నాయి.

చుట్టూ ఉన్న జనం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.వర్షంలో తడిచి ముద్దయిన ఓ ప్రేమజంట.

మెట్లమీద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటోంది.అసలే ప్రేమ.

ఆపై రొమాంటిక్ వాతావరణం.అంతే.

Advertisement

ఆ ప్రేమపక్షులు చుట్టుపక్కలున్న వారిని పట్టించుకోకుండా ముద్దుపెట్టుకున్నారు.ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్‌ అహ్మద్‌ తీశారు.

ఇక అక్కడితో వివాదం మొదలైంది.

వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్‌ అహ్మద్‌ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది.ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే బంగ్లాదేశ్‌లో ప్రేమజంట ఇలా బహిరంగంగా ముద్దాడటం, ఫొటో తీస్తున్నప్పటికీ వారించకపోవడం సంచలనంగా మారింది.అందులో తప్పేముంది, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా ఈ ఫొటోను భావిస్తున్నానని ఫొటో గ్రాఫర్ చెప్పినా ఎడిటర్ వినలేదు.

దీంతో అహ్మద్ ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్ట్ చేశాడు.గంటలోనే దాన్ని 5 వేల మంది షేర్ చేశారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

‘ఇదే నిజమైన బంగ్లాదేశ్‌.ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది.నా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి.

Advertisement

తరచుగా ముద్దు పెట్టుకోవాలి.ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు.

స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు.ముద్దు సీన్ వైరల్ కావడంతో ఛాందసవాదులు జీర్ణించుకోలేకపోయారు.

జిబాన్‌పై దాడి తర్వాత అతడు పనిచేస్తున్నవెబ్‌సైట్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.ఇస్లామిస్టులు జిబాన్‌పై దాడి చేయడం కొత్తేంకాదు.2015లో బంగ్లాదేశ్‌–అమెరికన్‌ హేతువాద బ్లాగర్‌ అవిజిత్‌ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు.తనను కాపాడాలని రాయ్‌ భార్య వేడుకుంటుంటే జిబాన్‌ అహ్మద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

దీంతో ఆగ్రహానికి గురైన ఛాందసవాదులు అతనిపై దాడి చేశారు.

తాజా వార్తలు