టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.శనివారం అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు.
సొంత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.వివరాలలోకి వెళ్తే.
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/07/Senior-Telugu-actress-Annapurnas-daughter-Kirthi-commitssuicide.jpg)
అన్నపూర్ణకు పిల్లలు లేకపోవడంతో కీర్తిని దత్తత తీసుకుని ఐదేళ్ల క్రితం కర్ణాటకకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లిచేశారు.ఈయన ఎఫ్ సీ ఐలో క్లర్క్‌గా పనిచేస్తుండగా.హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ కృష్టా అపార్ట్‌మెంట్‌లోని గోదావరి ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు.కీర్తి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.అయితే కూతురుకి మాటలు సరిగా రాకపోవడంతో గత కొంతకాలంగా వైద్య సహాయం అందిస్తున్నారు.ఇక కూతురికి మాటలు వచ్చే అవకాశం లేకపోవడంతో డిప్రెషన్ కి గురై కీర్తి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
![](https://TeluguStop.com/wp-content/uploads/2018/07/Senior-Telugu-actress-Annapurnas-daughterKirthi-commits-suicide.jpg)
” పాపకు ఇక మాటలు రావను కొని కొద్ది రోజులుగా ఢిఫ్రెషన్‌లోకి వెళ్ళింది.పాప కు ఏమి కాదు అని ధైర్యం చెప్పి కీర్తికి కౌన్సెలింగ్ ఇస్తున్నాము.ఈ రోజు తెల్లవారుజామున బెడ్ రూమ్ డోర్ తీయక పోవడంతో అనుమానం వచ్చి డోర్ పగులగొట్టి లోనికి వెళ్లి చూస్తే… ఉరి వేసుకొని కనిపించింది’’ అని తెలిపారు అన్నపూర్ణ.కీర్తి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.