Balakrishna Allu Sirish : అల్లు శిరీష్ నా కుర్చీకే ఎసరు పెట్టాడు.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు?

స్టార్ హీరో బాలకృష్ణ నిజ జీవితంలో సరదాగా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బాలకృష్ణ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రైలర్ బాగుందని నాకు కూడా ఇలాంటి సినిమాలలో నటించాలని ఉన్నా పరిమితులు ఉన్నాయని బాలయ్య చెప్పుకొచ్చారు.ఫ్యాన్స్ కు నచ్చని సినిమాలను వాళ్లపై రుద్దాలని నేను అనుకోనని బాలయ్య కామెంట్లు చేశారు.

నా సినీ కెరీర్ ఎప్పుడు మొదలైందో గీతా ఆర్ట్స్ కూడా అప్పుడే మొదలైందని బాలయ్య పేర్కొన్నారు.అల్లు రామలింగయ్య గారితో చాలా సినిమాలు చేశానని బాలయ్య అన్నారు.

అల్లు శిరీష్ గురించి చాలా విషయాలు విన్నానని అల్లు శిరీష్ నా కుర్చీకి ఎసరు పెట్టే ప్రయత్నం చేశాడని బాలయ్య చెప్పుకొచ్చారు.అన్ స్టాపబుల్ షోకు ఎసరు పెట్టాలని అల్లు శిరీష్ చూశాడని బాలయ్య చెప్పుకొచ్చారు.

Advertisement
Balakrishna Sensational Comments About Allu Shirish Goes Viral , Balakrishna ,

నా షోకు గెస్ట్ గా పిలిపించి అల్లు శిరీష్ రహస్యాలను బయటపెడతానని బాలయ్య వెల్లడించారు.బాలయ్య గెస్ట్ గా హాజరు కావడంతో ఊర్వశివో రాక్షసివో సినిమాపై అంచనాలు పెరిగాయి.

నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో అల్లు శిరీష్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

అల్లు శిరీష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

Balakrishna Sensational Comments About Allu Shirish Goes Viral , Balakrishna ,

ఊర్వశివో రాక్షసివో సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే అల్లు శిరీష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని చెప్పవచ్చు.అల్లు శిరీష్ ప్రస్తుతం పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు