బాలయ్య చిరు వివాదంలో కేసీఆర్ ఇరుక్కున్నాడుగా ?

తామంతా ఒక్కటే అని, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా అన్నదమ్ముల వలే కలిసిమెలిసి ఉంటున్నామని, మా మధ్య ఎటువంటి ఇగోలు లేవని పదేపదే చెబుతూ ఉంటారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు.

తెరవెనుక మాత్రం వీరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి అన్న విషయం అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది.

ఆ విధంగానే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, వార్ మొదలైనట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినిమా ఇండస్ట్రీ కార్మికుల కోసం కరోనా చారిటీ క్రైసిస్ పేరుతో నిధుల సేకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ కమిటీలో చిరంజీవి, నాగార్జున, నిర్మాత సి.కళ్యాణ్, దాము, అల్లు అరవింద్ దిల్ రాజు తదితరులు ఉండగా, దర్శకులు రాజమౌళి మొహర్ రమేష్, కొరటాల శివ వంటి వారు ఉన్నారు.వీరంతా కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలవడం, ఈ చారిటీ గురించి చర్చించడం జరిగింది.

ఈ సమావేశానికి తనను పిలవలేదని, మంత్రితో కలిసి భూములు పంచుకునేందుకు వీరంతా వెళ్లారు అంటూ హీరో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Advertisement

అలాగే నిర్మాత సి.కళ్యాణ్ బాలయ్య వ్యాఖ్యలకు స్పందించారు.

తాము కేసీఆర్ ఆహ్వానం మేరకు అందర్నీ పిలిచామని, కేసీఆర్ కనుక పిలవమని ఉంటే బాలయ్యను తప్పకుండా పిలిచేవరమని కౌంటర్ ఇచ్చారు.అంటే కేసీఆర్ బాలయ్యను పిలవమని చెప్పలేదు కాబట్టి, తాము పిలవలేదు అన్నట్లుగా సి.

కల్యాణ్ వ్యాఖ్యానించారు.ఇక మంత్రితో కలిసి భూములు పంచుకునేందుకు వెళ్లారు అన్న వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట.

అలాగే చిరు నాయకత్వంలోని ఈ చారిటీ బృందం బాలయ్యను తాము ఉద్దేశపూర్వకంగా మర్చిపోలేదని, కెసిఆర్ నిర్ణయం మేరకు మేమంతా వెళ్లి కలిశామని, మొత్తం వ్యవహారంలో బాధ్యుడు కేసీఆర్ అన్నట్లుగా వారు చేతులు దులుపుకోవడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేసీఆర్ ఇరుక్కు నట్లు అయింది.అలాగే ప్రత్యక్షంగా తమ ప్రభుత్వం పైన బాలయ్య విమర్శలు చేయడంపైన టిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి.బాలయ్యకు గట్టి కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నాయి.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
జీవీ ప్రకాష్ సైంధవి విడిపోవడానికి కారణాలివే.. ఆ రీజన్ వల్లే విడిపోతున్నారా?

మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో , ఎక్కడ పులిస్టాప్ పడుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు