మ‌ళ్లీ అదే ఫాలో అవుతున్న బాబు..!!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో చంద్రబాబు ఉన్నారు.ఆ దిశ‌గా ఎన్నో వ్యూహాలు ర‌చిస్తున్నారు.

పార్టీలు మార్పులు కూడా చేస్తున్నారు.ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే పార్టీ నేత‌ల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇక జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.గెలుపుకోసం అన్ని దారులు తెరుస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఒకపుడు అమలు చేసిన వ్యూహానికి మళ్లీ పదును పెడుతున్నారట.అదేంటంటే తటస్తులకు సీట్లనే పాత ఫార్ములాను అమలు చేయాలని అనుకుంటున్నార‌ట‌.

Advertisement
Babu Is Following The Same Again , Chandra Babu Naidu, TDP, Andhra Pradesh, Ycp

పార్టీల వారీగా ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉంటుందని అందరికీ తెలిసిందే.ఆరునూరైనా ఈ ఓటు బ్యాంకు దాదాపు ఆయా పార్టీలకే పడుతుంటుంది.

గ‌తంలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకుని.

పార్టీల వారీగా చీలిపోయిన ఓటు బ్యాంకు కాకుండా తటస్తుల ఓట్లు చాలానే ఉంటాయి.

ఈ తటస్తుల్లో ఎంతమంది ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారో ఆ పార్టీనే గెలుస్తుంది.ఒకపుడు తటస్థుల ఓట్లను సాధించేందుకు 1999 ఎన్నికల్లో చంద్రబాబు తటస్తులకు టికెట్లనే ప్రయోగం చేశారు.

దానివల్ల ఏమైందంటే తటస్తుల ఓట్లు కూడా కొన్ని టీడీపీకి పడ్డాయి.తటస్తుల కోటాలో ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారిలో శెనక్కాయల అరుణ లాంటి కొందరు గెలిచి మంత్రులు కూడా అయ్యారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఈ ప్ర‌యోగానికి అప్పట్లో ఆకర్షితులై మున్సిపల్ కమిషనర్లు, లెక్చరర్లు, రిటైర్డు అధికారులు పోలీసు అధికారులు పార్టీలో చేరారు.వీరిలో కొందరికి టికెట్లిచ్చి ప్రోత్సహించారు.

Advertisement

అయితే తర్వాత ఇదే ప్రయోగం స‌క్సెస్ కాలేదు.ఇక మ‌ళ్లీ ఇంత కాలానికి తటస్తుల‌కే టికెట్ల‌నే ప్ర‌యోగానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అప్పుడు అధికారం ఉంది కాబ‌ట్టి.

.అయితే అప్పట్లో చంద్రబాబు ప్రయోగం చేయగలిగారంటే అధికారంలో ఉన్నారు కాబట్టి స్వేచ్చగా చేయగలిగారు.కానీ ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారు.

అందులోను వైసీపీని ఎదుర్కోవ‌డంలో ఇబ్బందులు పడుతున్నారు.మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈ ప్ర‌యోగాన్ని స‌క్సెస్ ఫుల్ చేయ‌గ‌ల‌రా.? అనే ప‌శ్న‌లు వినిపిస్తున్నాయి.పైగా రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు టీడీపీకి అత్య‌వ‌స‌రం.

మ‌రి ఇలాంటి ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగాలకు పోయి సక్సెస్ అవుతారా.? లేదా మ‌ళ్లీ బోల్తా ప‌డ‌తారో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు