కుటుంబ నియంత్రణపై అవగాహన

సూర్యాపేట జిల్లా:ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శారద ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వైద్య విద్యార్థులు,డాక్టర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ప్రపంచ జనాభాకు 100 కోట్ల జనాభా ఆధనంగా చేరుతుందని,1999 నుండి 95 శాతం జనభా పెరుగుదల అభివృద్ది చెందుతున్న దేశాలలో జరుగుతుందని అన్నారు.

అభివృద్ది చెందిన దేశాలలో జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గిపోయి,దాదాపు నిలకడగా స్థిరంగా ఉన్నదని దీనికి తోడు సగటు ఆయు ప్రమాణము ఘననీయంగా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్దుల జనాభా ఆయా దేశాలకు శాపంగా మారినదని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.కోట చలం మాట్లాడుతూ ప్రతి అర్హులైన దంపతులకు కుటుంబ నియంత్రణ పద్దతులపై అవగాహన కల్పించి నియంత్రణకు పద్ధతులు,స్టీరికరణపై తగు చర్యలు తీసుకోవాలన్నారు.మన జిల్లా జనాభా 11,85,230 లుగా అంచనా వేయనైనదని అన్నారు.ప్రస్తుత మన జిల్లా జననాల రేటు1000 జనాభాకు 16.9 ఉన్నది.మరణాల రేటు 6.3 గా ఉన్నది.ప్రతి సంవత్సరం 1000 జానాభాకు అదనంగా 10 మంది జమ అవుతున్నారని తెలిపారు.

దీనివలన ఎన్ని ప్రణాళికలు చేసినా జనాభా వలన అనేక ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.కుటుంబ నియంత్రణపై ప్రజలందరికని అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరచి జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరూ భాద్యత వహించాలని ప్రపంచ జనాభా దినోత్సవ ఉద్దేశ్యం అని తెలిపారు.

ప్రస్తుతము మన దేశంలో 59 శాతం మంది ప్రజలు ఉత్పాధక శక్తి గల యువత ఉన్నది,ఇది ప్రపంచంలో మరే దేశంలో లేని మానవ వనరు.అందుకే ప్రపంచం మొత్తం పనిశక్తి,మేధాశక్తి,ఉత్పాధకత శక్తి గల మన దేశం వైపు దృష్టి మరల్సింది.1955 లో మన దేశంలో అధిక పునరుత్పత్తి రేటు 5.9 గా ఉన్నది.అది ప్రస్తుతము 2.2 గా నమోదైనది,ప్రస్తుతం జనాభా పెరుగుదల తగ్గినది మరింత తగ్గించవలసిన అవసరం ఉన్నదని అన్నారు.తదుపరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డా.మురళీధర్ రెడ్డి, స్త్రీల విభాగ అధిపతి డా.ఆధి సుజాత జనాభా పెరుగుదల నియంత్రణపై వివరించినారు.జిల్లాలో కుటుంబ సంక్షేమం కొరకు పనిచేస్తున్న సిబ్బంది అందరినీ అభినందించారు,ఉత్తమ సర్జన్ డా.కె.మమత,ఉత్తమ స్టాఫ్ నర్స్ సునీత,ఉత్తమ సూపర్వైజర్ రంగమ్మ,ఉత్తమ మహిళా ఆరోగ్య కార్యకర్త ఆర్.మాధవి,ఉత్తమ ఆశా కార్యకర్త శోభారాణి లను జ్ఞాపిక ప్రశంశా పత్రంతో సత్కరించినారు.జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలైన బాల్యవివాహాలు,పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం,కానుపుకు కానుపుకు మధ్య ఎడం లేకపోవడం,మగపిల్లలకోసం ఎదురుచూడడం వలన జనాభా పెరుగుదల ఉంటుందని దీనిని గమనించి ప్రజలు కుటుంబ నియంత్రణ పద్దతులగురించి తెలుసుకుని పాటించాలన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు,డా.వెంకటరమణ,డా.శ్రీ నివస రాజు,ఎస్‌ఓ వీరయ్య,డెమో అంజయ్య గౌడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News