మూడో టెస్టులో గెలుపు కోసం ఆస్ట్రేలియా రోలర్లు, స్టీల్ డబ్బాలతో ప్రాక్టీస్..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లలో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లోను ఆస్ట్రేలియా ఘోరంగా పరాజయం అయిన సంగతి తెలిసిందే.ఇదేమి కొత్త కాదు.

19 సంవత్సరాలుగా ఇండియాలో సిరీస్ కోసం చాలా తంటాలు, సరికొత్త ప్లాన్లు వేసిన ఫలితం లేకుండా పోయింది.ఇందులో భాగంగా 2023 లో జరిగే సిరీస్ లో అయినా విజయం సాధించడం కోసం ముగ్గురు స్పిన్నర్లను దించిన, భారత యువ స్పిన్నర్ల దగ్గర శిక్షణ తీసుకున్న కూడా చివరికి నిరాశే మిగిలింది.

ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో విజయం సాధించడానికి ఎటువంటి అవకాశాలు లేవు.

Australia Practice With Rollers And Steel Boxes For Victory In The Third Test. S

ఇప్పుడైనా బాగా ఆడి సిరీస్ డ్రా చేసుకోవడమో లేదా అవమానంతో వెనుతిరగడమే మిగిలింది.అయితే మూడవ టెస్ట్ సిరీస్ ను కాస్త సీరియస్ గా తీసుకొని గెలిస్తే కనీసం పరువైన నిలబడుతుంది.ఇందుకోసం గట్టిగానే ప్రాక్టీస్ చేస్తుంది ఆస్ట్రేలియా.

Advertisement
Australia Practice With Rollers And Steel Boxes For Victory In The Third Test. S

రెండవ టెస్టులో ఫీల్డర్స్ క్యాచ్లు మిస్ చేయడం వల్లనే, ఘోరంగా ఓడిపోవలసి వచ్చింది.జరిగిన రెండు టెస్టులలోని వైఫల్యాలను గుర్తించి ప్రస్తుతం సరికొత్త రీతిలో ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది.

Australia Practice With Rollers And Steel Boxes For Victory In The Third Test. S

ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ ఆండ్రూ బోర్వెక్ ఆధ్వర్యంలో స్మిత్ తో పాటు మిగతా జట్టు సభ్యులు పిచ్ రోలర్, స్టీల్ డబ్బాలతో ప్రాక్టీస్ చేస్తున్నారు.ఈ ప్రాక్టీస్ కు కారణం ఏమంటే బౌలింగ్ వేసినప్పుడు బంతి పిచ్ ల మీద కంటే రోలర్, స్టీల్ డబ్బాలపై పడినప్పుడు ఎక్కువగా మెలికలు తిరుగుతుంది.పిచ్ పై బాల్ పడినప్పుడు ఎటు టర్న్ అవుతుందో తెలుసుకోవడం కోసమే ఈ ప్రాక్టీస్.

దీనితోపాటు బేస్ బాల్ తో క్యాచ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.ఆస్ట్రేలియా టీం సారథి కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ తాత్కాలిక సారథి గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప్రాక్టీస్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో మార్చి 1 తెలుస్తుంది.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు