సిరిసిల్లలో బిక్షాటన చేసిన ఆశ వర్కర్లు..

మ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె ఈరోజు 10 వ రోజుకు చేరుకుంది.

రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఆశా వర్కర్లు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యల పట్ల మొండి వైఖరి వహించడం సరికాదన్నారు ఆశ వర్కర్లు అడిగేవి గొంతు కోరికలు కాదని చట్టబద్ధమైన డిమాండ్లని అన్నారు.సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రకటించిందని ఆశ వర్కర్లు ఫిక్స్డ్ వేతనం 18000 మాత్రమే అడుగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఆశ వర్కర్ల సమస్యలు డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కూడా ఆశ వర్కర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆశ యూనియన్ అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి జయశీల, భారతి, లత, కస్తూరి, రుచిత, లావణ్య, గాయత్రి, చంద్రకళ పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown
Advertisement

Latest Rajanna Sircilla News