ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఆట, పాట లతో ఆవిష్కరించిన కళాకారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తికావొస్తున్న సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సినారె హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను.

*జయ జయహే ప్రజా పాలన*ధూం.

ధాంగా నిర్వహించారు.ఈ  ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కళాకారులు చేసిన ప్రదర్శన తెలంగాణ నృత్య రూపకం, ప్రజా పాలన నాటకం, అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ జాతీయ గీతం ఆకట్టుకుంది.

కళా ప్రదర్శనలు ద్వారా సామాజిక సందేశాలు ప్రజల హృదయాలకు చేరేలా చేశారు.ప్రభుత్వ ఆధ్వర్యంలో సేకరిస్తున్న వరి ధాన్య కొనుగోలు దొడ్లు, సన్నపు ధాన్యాలకు 500 బోనస్ తదితర అంశాలపై వివరించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సంబురాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర  ప్రదర్శనలో జిల్లా కి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులూ, అలేఖ్య పుంజాల  బృందం ఆటపాటలు, నాటికలతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పాలనను ఆవిష్కృతం చేశారు.

Advertisement

కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు, యువతీయువకులు,  అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే.. ప్రతి రోజు ఉదయాన్నే వీటిని తీసుకోవడం మంచిది..
Advertisement

Latest Rajanna Sircilla News