ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం స్పెషల్ సీపీ నియామకం..!

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone Tapping Case ) విచారణపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది.

ఈ మేరకు కేసు విచారణ కోసం స్పెషల్ సీపీని( Special CP ) నియమించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.కాగా నెల రోజులుగా ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు,( EX DCP Radhakishan Rao ) మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.అదేవిధంగా ఈ కేసులో ఆధారాల సేకరణపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక సీపీ నియామకం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు