విద్యార్థులు వారు చదువు ముగించుకొని కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేందుకు ప్రస్తుతం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటేగాని మంచి జాబ్ రావట్లేదు.మరి ముఖ్యంగా పెద్దపెద్ద కాలేజీలలో సైతం వచ్చే క్యాంపస్ డ్రైవ్స్ కూడా ఈ మధ్య తగ్గుముఖం పట్టాయి.
ఒకవేళ అదృష్టం కొద్దీ ఉద్యోగం వచ్చిన చాలీచాలని జీతంతో మొదటగా ట్రైనిగా పనిచేస్తూ ఆపై పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ఉద్యోగాలను కాపాడుకోవాల్సి వస్తుంది.ఇక ఇది చేత కాకపోతే చివరికి సొంతంగా వ్యాపారం చేయడం, లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్( Shopping malls ) లేదా దుకాణాలలో పనిచేయడానికి సిద్ధపడతాం.
ఇకపోతే దుకాణాలలో లేదా షాపింగ్ మాల్స్ లో పనిచేయడానికి వెళ్తే అక్కడ ఎన్ని ఏళ్ళు గడిచిన చివరికి 12 నుంచి 15 మధ్య జీతం మాత్రమే లభిస్తుంది.ఇకపోతే తాజాగా ఓ మోమోస్ రెస్టారెంట్( Momos Restaurant ) వద్ద హెల్పర్ ఉద్యోగం కోసం చేరితే స్టార్టింగ్ లోనే ఏకంగా రూ.25 వేల జీతం ఇస్తామని ప్రకటనలో తెలిపింది.దాంతో ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.
ఈ పోస్టర్ పై హిందీలో ఉద్యోగ ప్రకటన వివరాలను రాసుకోవచ్చారు.
ఈ పోస్టర్ చూసిన నెటిజెన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఉద్యోగులకు మొదట్లో ఇంత జీతం ప్రస్తుతం రావట్లేదని కొందరు అంటుండగా.అసలు జాబ్ ఎక్కడ, వెళ్లి మేము జాయిన్ అవుతామని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ రెస్టారెంట్లో పని చేస్తే జీతంతో పాటు జీవితాంతం మోములు కూడా ఉచితంగా లభిస్తాయని మరికొందరు రాసుకోవచ్చారు.
కాకపోతే ఈ పోస్టర్ సంబంధించిన స్థలం మాత్రం తెలియరాలేదు.