ప్రస్తుత రోజుల్లో అవసరమైన సమయాల్లో ఎవరికైనా డబ్బులు అవసరమైనప్పుడు మనకి అనేక రకాల రుణం ఇచ్చే కంపెనీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.ఇందులో భాగంగానే ఒక్కో కంపెనీ ఒక్కోరకమైన వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో ఇలాంటి రుణాల కోసం( Loans ) ఎక్కడికి వెళ్లకుండా మనము ఉన్న చోట నుంచి మన చేతిలోని మొబైల్ ఉపయోగించి లోన్ పొందవచ్చు.ప్రస్తుతం ఇలాంటి సంగతికి సంబంధించి అనేక రకాల లోన్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.
మామూలుగా మనము బ్యాంకులు ఎన్బిఎఫ్సి ల ద్వారా రుణం పొందాలంటే ఎన్నో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సుదీర్ఘ ప్రక్రియ తర్వాతనే రుణం అమౌంట్ దొరుకుతుంది.
ఒకపోతే తాజాగా ఈ గూగుల్ సంబంధించిన జిపే లోన్స్( GPay Loans ) సమీపాయాన్ని అందించబోతోంది.జిపే తన వినియోగదారుల కోసం రూ 15 వేల వరకు లోన్ పొందే అవకాశాన్ని ఇస్తుంది.
ఇక ఈ లోన్ సంబంధించి వివరాలను ఓసారి చూద్దాం.
గూగుల్( Google ) తన తొమ్మిదో ఎడిషన్ లో భాగంగా ఈ కొత్త విషయాన్ని ప్రకటించింది.ముఖ్యంగా చిన్న వ్యాపార వస్తువులను టార్గెట్ చేస్తూ ఈ లోన్ సదుపాయాన్ని తీసుకురాబోతోంది.గూగుల్ సంస్థ డి.
ఎం.ఐ ఫైనాన్స్ తో జతకలిసి లోన్ సదుపాయం అందించనుంది.ఇందులో భాగంగానే చిన్న వ్యాపారాలకు( Small Businesses ) తరచుగా కొద్ది మొత్తంలో రుణాలను, అలాగే అనువైన రీపేమెంట్ ఆప్షన్లను ఇవ్వడానికి సదుపాయం కల్పిస్తుంది.
ఇక ఈ సమాచారం ప్రకారం నిర్దిష్ట అర్హత కలిగిన భారత పౌరులు ఎవరైనా సరే ఐదువేల నుంచి 15 వేల వరకు రుణాన్ని పొందవచ్చు.ఇందులో భాగంగా మీరు ఎలాంటి డాక్యుమెంటేషన్ ప్రక్రియ లేకుండానే అతి తక్కువ వ్యవధిలో రుణాన్ని అందిస్తుంది.ఇక రుణం తిరిగి ఇచ్చే సమయంలో 111 రూపాయల నుండి మీ రీపేమెంట్ ప్రారంభమవుతుంది.
ముఖ్యంగా టైర్ 2 నగరాలను గూగుల్ పే ఈ రుణాలని అందించబోతున్నట్లు సమాచారం.ప్రతినెల 15 వేల కంటే ఎక్కువ జీతం ఉన్న వారు ఈ లోన్ పొందడానికి అర్హులు.