కాంగ్రెస్ టికెట్ కు దరఖాస్తు చేసుకోండి ఇలా ! ఫీజు, రూల్స్ ఇవే

తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయింది.ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో, టికెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు గాంధీభవన్ చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు .

 Apply For Congress Ticket Like This! The Fees And Rules Are The Same , Telangan-TeluguStop.com

అలాగే కాంగ్రెస్ లోని కీలక నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ , తమ టిక్కెట్ ను కన్ఫర్మ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు టికెట్ ను ఆశిస్తూ ఉండడంతో,  ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే విషయంలో తర్జన భర్జన పడుతోంది.

ఇదిలా ఉంటే .నిన్న జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశంలో టికెట్లు ఖరారు అంశంపైనే ప్రధానంగా చర్చించారు.ఎన్నికలకు రెండు నెలలు ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే పూర్తి చేశారు.ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నిన్న జరిగిన కమిటీ సమావేశంలో అభ్యర్థులు ఎంపిక అంశంపైనే ప్రధానంగా చర్చించారు.

సెప్టెంబర్ లో అభ్యర్థుల మొదటి విడత జాబితాను విడుదల చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తుంది.

Telugu Pcc, Revanth Reddy, Telangana-Politics

 పార్టీ తరఫున టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో , వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.ఈ మేరకు అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు విధి విధానాలను రూపొందించింది.ఈ మేరకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీకి దామోదర్ నరసింహ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా , రోహిత్ చౌదరి,  మహేష్ గౌడ్ సభ్యులుగా ఉన్నారు.17వ తేదీని విధివిధానాలు ఖరారు చేసేందుకు డెడ్ లైన్ గా నిర్ణయించారు.18 నుంచి 25వ తేదీ వరకు డీడీ ల రూపంలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

Telugu Pcc, Revanth Reddy, Telangana-Politics

 ఓసి అభ్యర్థులకు పది వేలు, బీసీ అభ్యర్థులకు 5 వేలు,  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 2500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సర్వే ఆధారంగా నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి ఏఐసికి పంపాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించుకుంది.ఈ  పేర్లలో ఒక పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందట.

కర్ణాటక కాంగ్రెస్ లోనూ ఇదే విధమైన ఫార్ములాను అవలంబించడంతో ఇక్కడ కూడా అదే విధంగా విధి విధానాలు ఖరారు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube