బాబుకు పైన ఖుషీ...లోప‌ల్ టెన్ష‌న్‌..!

అవును! ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు ఇలానే ఉంద‌ట‌! పెద్ద నోట్ల‌ను ర‌ద్దు విష‌యంలో ఆయ‌న పైకి హ్యాపీగా క‌నిపిస్తున్నారు.అంతేకాదు.

ఒక అడుగు ముందుకు వేసి .అస‌లీ ర‌ద్దు నిర్ణ‌యం తాను రాసిన లేఖ వ‌ల్లే తీసుకున్న‌ద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.దేశంలో రూ.1000 నోట్ల ర‌ద్దు అత్య‌వ‌స‌ర‌మ‌ని, దీనివ‌ల్లే బ్లాక్ మ‌నీ విచ్చ‌ల‌విడిగా పెరిగిపోతోంద‌ని పెద్ద ఎత్తున మొన్నామ‌ధ్య ఆయ‌న ఓ స‌భ‌లో ప్ర‌క‌టించారు.అదే సందర్భంగా ఆయ‌న రూ.1000 నోట్లు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.తాను ప్ర‌ధానికి న‌రేంద్ర మోడీకి లేఖ రాసిన‌ట్టు కూడా చెప్పుకొచ్చారు.

AP CM Chandrababu Tension Over Big Notes Ban-AP CM Chandrababu Tension Over Big

ఇక‌, ఇప్పుడు దేశంలో పెద్ద నోట్లు ర‌ద్ద‌యిపోయాయి.ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.

పెద్ద నోట్లు చిత్తుకాయితాల‌తో స‌మానం అయిపోయాయి.ఈ ప‌రిణామం చంద్ర‌బాబుకు ఎంతో ఆనందం క‌లిగించింది.

Advertisement

ప్ర‌ధాని నోట్ల ర‌ద్దు విష‌యం ఢిల్లీలో ప్ర‌క‌టించిన అర‌గంట‌లోనే విజ‌య‌వాడ‌లో మాట్లాడిన చంద్ర‌బాబు.హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.బ‌హుశ ఓ ముఖ్యమంత్రి అంత అర్జంటుగా ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన ప‌రిణామం బాబు త‌ప్ప ఎవ‌రూ చేయ‌లేదు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.అస‌లు క‌ష్టాలు ఇప్పుడే మొద‌ల‌య్యాయి బాబుగారికి! పెద్ద నోట్ల ర‌ద్దుతో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయింది.ముఖ్యంగా 2018 నాటికి రాజ‌ధాని అమ‌రావ‌తిని ఎలాగైనా ప‌ట్టాల‌కెక్కించి.2019లో ఆ క్రెడిట్‌ను ఓట్ల రూపంలో రాబ‌డ‌దామ‌ని సీఎం చంద్ర‌బాబు పెద్ద ప్లాన్ వేశారు.ఇప్పుడు అది కాస్తా అట‌కెక్కింది.

పెద్ద పెద్ కంపెనీలే చిన్న చిన్న నోట్లు లేక‌పోవ‌డంతో ప‌నులు నిలిపివేశాయి.దీంతో బాబు ఈ పెద్ద నోట్ల ర‌ద్దుపై పైకి హ్యాపీగానే ఫీల‌వుతున్నా.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. ఈ ఇద్దరు హీరోల మధ్య గ్యాప్ తగ్గినట్టేనా?

లోలోనే మాత్రం తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు.మ‌రోప‌క్క ఈ నోట్ల ర‌ద్దుతో విప‌క్షం వైకాపా ఖ‌జానా కొల్ల‌బోతుంద‌ని, జ‌గ‌న్ బెంబేలెత్తుతాడ‌ని కూడా భావించిన బాబుకు అటువైపు నుంచి ఇలాంటి ప‌రిణామం క‌నిపించ‌క‌పోవ‌డంతో నిరాశ చెందుతున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

సో.మ‌రి బాబుకు టెన్ష‌న్ కాక ఇంకేం మిగులుతుంది.

తాజా వార్తలు