News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసిన హై కోర్టు

 

ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ను ఏపీ హై కోర్ట్ సస్పెండ్ చేసింది.

 

2.  మత్స కారులను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం : టీడీపీ

  మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. 

3.ఇసుక వ్యవహారంపై సిపిఐ కామెంట్స్

 

ఏపీ సీఎం జగన్ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తోందని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 

4.దశపల్లా భూములపై జనసేన పోరాటం

 దసపల్లా భూములను 22A జాబితాలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, విశాఖ కలెక్టరేట్ వద్ద జనసేన ఆందోళన చేపట్టింది. 

5.వివేకా హత్య కేసు

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో వాయిదా పడింది. 

6.వైసీపీ దీక్షకు హర్ష కుమార్ సంగీభావం

  రాజమండ్రి పేపర్ మిల్లు కాలుష్యం నుంచి గోదావరి జలాలను కాపాడాలి అంటూ వైసీపీ నేత విశ్వేశ్వర రెడ్డి చేపట్టిన దీక్షకు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ సంఘీ భావం తెలిపారు. 

7.చంద్రబాబు పై జగన్ కామెంట్స్

 

Advertisement

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ను చూసి ఇదేం కర్మ రా బాబు అంటుకుంటున్నరని వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ కామెంట్ చేశారు. 

8.పెద్దపులి సంచారం

 

కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. 

9.చంద్రబాబుపై బొత్స కామెంట్స్

  టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. చంద్రబాబు సహనం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

10.తమిళనాడులో మద్రాస్ ఐ కలకలం

 

తమిళనాడులో మద్రాస్ ఐ ( కండ్ల కనక ) విజృంభిస్తోంది.మద్రాస్ ఐ కంటి వాపు, ఎరుపు వాపు దీని లక్షణాలు. 

11.నరసాపురంలో జగన్ పర్యటన

  వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు.వివిధ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలను జగన్ ఈ సందర్భంగా చేపట్టారు. 

12.ఏపీ మంత్రి సింగపూర్ పర్యటన

  ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు.సౌత్ ఈస్ట్ , ఏషియా పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారు. 

13. సంక్షేమ హాస్టళ్ల పోరు

  టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నేటి నుంచి సంక్షేమ హాస్టళ్ల పోరు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీ ఎన్ ఎస్ ఎఫ్ చేపట్టింది. 

14.తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు

 

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గుముఖం పట్టాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలో 8.2 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదయ్యింది. 

15.జనసేన పై జగన్ కామెంట్స్

  దత్త పుత్రుడు పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ కామెంట్ చేశారు. 

16.బిజెపిపై అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

  ఉచిత విద్యుత్ ను అడ్డుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆ పార్టీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. 

17.భారత్ లో కరోనా

Advertisement

  గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.బీజేపీ శిక్షణా తరగతులు ప్రారంభం

 బిజెపి శిక్షణా తరగతులు రెండో రోజు ప్రారంభమయ్యాయి.నేడు ఆరు అంశాలపై నేతలకు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. 

19.తిరుమల సమాచారం

 

తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు స్వామి వారిని దర్శించుకునేందుకు 12 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,500

 

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 52,920

               .

తాజా వార్తలు