న్యూస్ రౌండప్ టాప్ 20

1.మునుగోడు ఉప ఎన్నికల గుర్తులపై హైకోర్ట్ లో పిటిషన్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

మునుగోడు అసెంబ్లీ ఓపెన్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయింది.

టిఆర్ఎస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. 

2.నాగార్జునసాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత

 నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తితోంది.దీంతో ప్రాజెక్టులోని 14 గేట్లను కొంతమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

3 .శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్టుకు ఉన్న 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 

4.ఆర్టీసీలో ఇక నిరంతర వీఆర్ఎస్

 తెలంగాణ ఆర్టీసీలో దరఖాస్తు చేసిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ కు అనుమతించనున్నారు. 

5.ఏఐసిసి అధ్యక్ష ఎన్నికకు నేడు గాంధీభవన్ లో పోలింగ్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలలో భాగంగా సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో పోలింగ్ నిర్వహించనున్నారు. 

6.తెలంగాణకు కెసిఆర్ వెన్నుపోటు : కిషన్ రెడ్డి

  తెలంగాణకు కెసిఆర్ వెన్నుపోటు పొడిచారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 

7.బిజెపిలోకి బూర నరసయ్య గౌడ్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

టిఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సి గౌడ్ ఈనెల 19 ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు సంచారం. 

8.నింజ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసు

  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి ప్రాజెక్టు ( నింజ్)  ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసు జారీ చేసింది. 

9.ఎర్ర గంగిరెడ్డి కి సుప్రీం నోటీసులు

 

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించింది. 

10.దుర్గగుడి దసరా ఆదాయం 16 కోట్లు

 ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.దుర్గగుడి దసరా ఆదాయం 16 కోట్లు వచ్చినట్లుగా ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. 

11.పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన

 

ఈనెల 19వ తేదీన పల్నాడు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. 

12.గన్నవరం చేరుకున్న కేంద్రమంత్రి

  కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.అక్కడ నుంచి ఏలూరు,  గుంటూరు జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. 

13.శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం

 

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 24వ తేదీన ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోత్తం గా నిర్వహించనుంది. 

14.నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటు

  తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటయింది.ఐదుగురు సభ్యులతో ఆగమహా సలహా మండలని ఏర్పాటు చేస్తూ టిటీడీ ఉత్తర్వుల జారీ చేసింది. 

15.నేడు ఆళ్లగడ్డలో జగన్ పర్యటన

 

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు ఆళ్లగడ్డ లో పర్యటిస్తున్నారు. 

16.ముగిసిన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు

  ఏపీ గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు ముగిశాయి. 

17.ఆంధ్ర యూనివర్సిటీ వీసీని బర్తరఫ్ చేయాలి

 

Advertisement

ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మారుస్తూ , చెడ్డ పేరు తెస్తున్న బీసీ ప్రసాద్ రెడ్డి ని వెంటనే బర్త రఫ్ చేయాలని టిడిపి అధికార ప్రతినిధి కావలి గ్రేష్మ డిమాండ్ చేశారు. 

18.కమ్మ  సంఘం హెచ్చరిక

 కమ్మ సామాజిక వర్గంపై రాజకీయ పార్టీల నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని అఖిలభారత కమ్మ సామాజిక వర్గం వేదిక హెచ్చరించింది. 

19.ట్రిపుల్ ఐటీలో సర్టిఫికెట్ల అప్ డేషన్ కు  అవకాశం

 

ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి మార్కుల జాబితాను అప్డేట్ చేసుకోవచ్చు అని ఆర్జీయూకేటీ  ప్రకటించింది. 

20.నేడు రైతు భరోసా పిఎం కిసాన్ సొమ్ము విడుదల

  వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండో విడత చెల్లింపులకు సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు