న్యూస్ రౌండప్ టాప్ 20

1.అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఐపీసీ , సి ఆర్ పి సి చట్టాలలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

2.నారా లోకేష్ పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికీ 21వ రోజుకు చేరుకుంది.తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర జరుగుతోంది.

3.కవిత అరెస్టు ప్రచారంపై కేఏ పాల్ కామెంట్స్

ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని,  ఇదంతా కూతురు కవిత అరెస్టు ను తప్పించేందుకేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు.

4.కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా పై జీవీఎల్ విమర్శలు

బిజెపి ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేయడంపై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పందించారు.బిజెపిపై కన్నా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినవి అని జివిఎల్ పేర్కొన్నారు.గతంలోనూ సోమ వీర్రాజు పై ఆయన అనేక విమర్శలు చేశారని జీవీఎల్ మండిపడ్డారు.

5.జీవీఎల్ కు కాపు సంఘాల ప్రతినిధుల సన్మానం

రాధా రంగా మిత్రమండలి,  కాపు సంఘాల ప్రతినిధులు ఈరోజు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు సన్మానం చేశారు.

6.వివేకానంద రెడ్డి  హత్య కేసు

Advertisement

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

7.జగన్ పై అయ్యన్న సంచలన కామెంట్స్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు.జగన్ డైరెక్షన్ లోనే మాజీమంత్రి , జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య జరిగిందని అయ్యన్న విమర్శించారు.

8.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

9.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

రైతులు నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని,  రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

10.అప్సర్ భద్ర ప్రాజెక్ట్ పై బైరెడ్డి కామెంట్స్

రాయలసీమలో అప్సర్ భద్ర ప్రాజెక్ట్ రాయలసీమకు మరణ శాసనం లాంటిదని మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

11.జగన్ తో టిడిపి మాజీ ఎమ్మెల్యే భేటీ

కైకలూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

12.వికారాబాద్ జిల్లాలో పులి సంచారం

ఇక తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని భద్రపూర్ తండా అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

13.బీబీసీ ఆఫీసుల్లో కొనసాగుతున్న టాక్స్ సర్వే

బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సర్వే ఈరోజు మూడో రోజు కొనసాగుతోంది.

14.వంగవీటి రంగా చరిత్ర అరుదైన సంఘటన : జీవీ ఎల్

భారతదేశ చరిత్రలో వంగవీటి రంగా చరిత్ర అరుదైన సంఘటనగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.

15.ఆదాయాలపై తెలంగాణ సిఎస్ సమీక్ష

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సొంత పన్ను, పన్నేతర  ఆదాయాలపై ఆరా తీశారు.

16.మల్లన్న సాగర్ ను సందర్శించిన పంజాబ్ సీఎం

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
న్యూస్ రౌండప్ టాప్ 20

ఈరోజు సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవాన్ సింగ్ మాన్ పర్యటించారు ఈ సందర్భంగా మల్లన్న సాగర్ ను ఆయన సందర్శించారు.

17.టిఆర్ఎస్ పై బండి సంజయ్ కామెంట్స్

గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల సమస్యలు పరిష్కారానికి నిదుర ఇవ్వాలని అడుగుతున్న ప్రజాప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే ఇస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని, ప్రధాని మోది అలా చేస్తే బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

18.మంత్రి ఎర్రబెల్లి పై రేవంత్ రెడ్డి ఫైర్

 తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఓనమాలు,  ఏ బి సి డి లు కూడా రాయడం రాని ఎర్రబెల్లి మంత్రి అయ్యారని రేవంత్ విమర్శించారు.

19.పొత్తులు ఉండవు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం : కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో హాంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని,  అప్పుడే కాంగ్రెస్  బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే స్పందించారు .వచ్చే ఎన్నికల్లో పొ త్తులు ఉండవని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.

20.రోజు బంగారం ధరలు

Advertisement

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 22,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 56,730

తాజా వార్తలు