దాచిన దాగదుగా... అనుష్క శర్మ బేబీ బంప్ ఫొటోస్ వైరల్.. మరోసారి తండ్రి కాబోతున్న విరాట్!

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) విరాట్ కోహ్లీ ( Virat Kohli ) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.

 Anushaka Sharma Baby Bump Video Goes Viral, Anushka Sharma, Virat Kohli, Second-TeluguStop.com

ఇకపోతే వీరిద్దరి గురించి గత కొంతకాలంగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి ఈ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై అనుష్క శర్మ లేదా విరాట్ కోహ్లీ ఎక్కడ కూడా స్పందించలేదు.

ఇక ఈమె పలు సందర్భాలలో కెమెరా కంటికి చిక్కినప్పటికీ కూడా తన బేబీ బంప్( Baby Bump ) కనపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.అయితే తాజాగా వీరికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఇండియాలో వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అనుష్క తన భర్తతో కలిసి ఒక హోటల్ లోపలికి వెళ్తున్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో భాగంగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి అనుష్క శర్మ తన బేబీ బంప్ చేతులు వేసుకొని నడుస్తూ కనిపించారు.

ఇక ఈ వీడియోలో తన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనబడుతుంది.ఇదివరకు ముంబైలో ఒక గైనకాలజిస్ట్ ను కలిసినటువంటి వీరు ఎందుకు కలిసాము త్వరలోనే చెబుతాము అంటూ ప్రకటించారు.ఇక ఆ సమయంలో ఫోటోలు తీస్తుండగా విరాట్ కోహ్లీ ఫోటోలు తీయొద్దు అంటూ ఫోటోగ్రాఫర్లను రిక్వెస్ట్ చేసుకున్నారు.అప్పటినుంచి ఈమె మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నప్పటికీ ఈ జంట మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు అయితే తాజాగా ఈ వీడియో చూస్తే మాత్రం ఈమె తల్లి కాబోతుందంటూ స్పష్టంగా అర్థం అవడంతో ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube