లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ కు చెందిన శ్రవణ్ లోన్ యాప్ లో రూ.

3 లక్షలు లోన్ తీసుకున్నాడు.ఈ క్రమంలో రుణం చెల్లించాలంటూ యాప్ సంస్థల నిర్వాహకులు వేధింపులకు గురి చేశారని సమాచారం.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీరాముల శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేకనే తన భర్త బలవన్మరణం చెందాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు