మల్లెపూలు అమ్మే మహిళతో సుమ.. వీడియో వైరల్!

సుమ‌.యాంక‌రింగ్ లో జేజెమ్మ‌.

ఎవ‌రెస్ట్ శిఖ‌రం.

బుల్లితెర‌పై లేడీ సూప‌ర్ స్టార్.

ఎంత పెద్ద ఈవెంటైనా త‌న మాట‌ల‌తో, పంచ్ డైలాగుల‌తో ఆక‌ట్టుకోవ‌డంలో దిట్ట.అందుకే ఆమె తెలుగు లోగిళ్లో చిన్నవాళ్లందరికీ ఎప్పుడో అక్కగా మారిపోయింది.

ప‌రిచ‌యం లేకుండా చిన్న‌పిల్ల‌ల‌నుంచి పెద్ద‌వాళ్ల దాకా సుమ‌క్క అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు.కేర‌ళ నేప‌థ్య‌మే అయినా తెలుగు ప్ర‌జ‌ల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

Advertisement

సుమ తండ్రి పి.ఎన్.కుట్టి ఉద్యోగ‌రిత్యా కేర‌ళ నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చారు అదే స‌మ‌యంలో రాజీవ్ క‌న‌కాల తండ్రి దేవ దాస్ క‌న‌కాల డైర‌క్ట్ చేసిన మేఘమాల సీరియల్ లో సుమ యాక్ట్ చేసింది.ఆ స‌మ‌యంలో రాజీవ్ కనకాలతో పరిచయం అయింది.

ప‌రిచ‌యం ప్రేమ పెళ్లికి దారి తీసింది.వారికి ఇద్ద‌రు పిల్ల‌లు.

త్వ‌ర‌లో కొడుకు రోష‌న్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.ఇక షూటింగ్ ల‌తో బిజీగా ఉండే సుమ అభిమానుల్ని అల‌రించ‌డంలో ఎప్పుడూ ముందుంటారు.

టీవీ షోలు, ఆడియో ఫంక్ష‌న్ లు , ప్రైవేట్ ఈవెంట్ లు, సీరియ‌ల్స్ ఇలా అన్నీంట్లో త‌న హ‌వా కొన‌సాగిస్తున్న సుమ .ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాగా యాక్టీవ్ అయ్యారు.సుమ‌క్క యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా నెటిజ‌న్ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?

లాక్ డౌన్ టైమ్ లో కుక్క‌తో, వంట‌ల‌తో , క‌రోనా జాగ్ర‌త్తలు, డైలీ షూటింగ్ , మేక‌ప్ లు ఇలా వీడియోలు చేస్తూ ఫ‌న్ జ‌న‌రేట్ చేస్తున్నారు.తాజాగా సుమ పూలమ్మే మ‌హిళ‌తో జ‌రిపిన సంభాష‌ణ న‌వ్వులు పూయిస్తుంది.

Advertisement

మ‌ల్లెపూల‌కోసం రోడ్ సైడ్ ఓ పూలు అమ్మే మ‌హిళ వ‌ద్ద‌కు పూలెంతా అంటూ మాట ‌క‌లిపింది.సుమ‌ను గుర్తు ప‌ట్టిన మ‌హిళ వెంట‌నే మాస్క్ తొల‌గించి బాగున్నారా మేడం అని అడిగింది.

న‌న్ను చూస్తే ఎగ్జైట్‌మెంట్ అన్నీ ఉంటాయి కానీ మీ సేఫ్ కోసం మాస్క్ ధ‌రించాలని చెప్పింది.దీంతో మేడం మిమ్మ‌ల్ని చూసిన ఆనందంతో మాస్క్ తీశాన‌ని చెప్ప‌డంతో చిరున‌వ్వు తో మ‌ల్లెపూలు కొనుక్కోని అక్క‌డి నుంచి వెళ్లిపోయింది సుమ.వీరిద్దరి మ‌ధ్య జ‌రిగిన డిస్క‌ష‌న్స్ ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించుకోవాల‌ని సోష‌ల్ ఓరియెంటెడ్ మెసేజ్ తో ఆక‌ట్టుకుంటుంది బుల్లితెర మ‌హారాణి యాంక‌ర్ సుమ‌.

తాజా వార్తలు