రూట్ మార్చిన యాంకర్ రష్మీ.. ఆ ఛానల్ లో ఎంట్రీ..?

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మీ ఆ షోతో పాటు ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ఈవెంట్లలో మాత్రమే ఇప్పటివరకు సందడి చేశారు.

అనసూయ, సుమ, శ్రీముఖి లాంటి యాంకర్లు వేరే ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో పాల్గొన్నా రష్మీ మాత్రం ఇతర ఛానెళ్ల ప్రోగ్రామ్ లకు దూరంగా ఉన్నారు.

సుడిగాలి సుధీర్ కూడా ఎక్కువగా ఈటీవీ ఛానెళ్లలోని ప్రోగ్రామ్ లలోనే సందడి చేశారు.అయితే రష్మీ స్టార్ మా ఛానెల్ లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే 100 % లవ్ అనే ప్రోగ్రామ్ లో సందడి చేయనున్నారు.

యాంకర్ రష్మీ వేరే ఛానల్ లో కనిపించడం.స్టార్ మా ఛానల్ ప్రోగ్రామ్ లో ఎంట్రీ ఇవ్వడం అభిమానులను సైతం అవాక్కయ్యేలా చేసింది.

ఈ ప్రోగ్రామ్ లో రష్మీ ఊరమాస్ పాటకు స్టెప్పులేశారు.రీల్ జోడీలతో, రియల్ జోడీలతో స్టార్ మా నిర్వాహకులు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు.

Anchor Rashmi Entry In Star Maa 100 Percent Love Program, 100 Percent Love, Anch
Advertisement
Anchor Rashmi Entry In Star Maa 100 Percent Love Program, 100 Percent Love, Anch

అయితే ఈ ప్రోగ్రామ్ లో సుధీర్ కూడా పాల్గొంటారో లేదో తెలియాల్సి ఉంది.బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడీకి ఎంతో క్రేజ్ ఉంది.ఆ క్రేజ్ ప్రోగ్రామ్ లకు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లను తెచ్చిపెడుతోంది.

ఒకప్పుడు రవిలాస్య జోడీ ఏ స్థాయిలో అలరించారో ఇప్పుడు రష్మీ సుధీర్ జోడీ అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకున్నారు.ఈ రీల్ జోడీ రియల్ జోడీ కావాలని కూడా చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే రష్మీ స్టార్ మా ఛానల్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిందో లేక భవిష్యత్తులో ఏదైనా ప్రోగ్రామ్ కు యాంకర్ గా చేస్తారో తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఢీ, జబర్దస్త్ ప్రోగ్రామ్ లతో రష్మీ బిజీగా ఉన్నారు.

మరోవైపు రీల్ జంటలు, రియల్ జంటలు సందడి చేయబోతున్న ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు