ఆ యూట్యూబ్ ఛానల్ పై ఫైర్ అయిన గాయత్రి భార్గవి.. థంబ్ నెయిల్ అలా పెట్టారంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్లలో గాయత్రి భార్గవి( Gayatri Bhargavi ) ఒకరు.గాయత్రి భార్గవి పలు సినిమాలలో సైతం నటించి తన నటనతో పాపులారిటీని పెంచుకున్నారు.

అయితే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన థంబ్ నెయిల్స్( Thumbnails ) పై ఆమె చాలా సీరియస్ అయ్యారు.8 నెలల క్రితం గాయత్రి భార్గవి ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.గాయత్రి భార్గవి తన భర్త గురించి చెప్పిన విషయాలను తప్పుగా థంబ్ నెయిల్స్ తో పెట్టడంతో అమె సీరియస్ అయ్యారు.

తన భర్తతో కలిసి వీడియో చేసి ఫేక్ ప్రచారం గురించి ఆమె రియాక్ట్ అయ్యారు.ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కు సైతం ఫేక్ థంబ్ నెయిల్స్ గురించి సమాచారం ఇచ్చినా పదేపదే ఇదే రిపీట్ అవుతుండటంతో సోషల్ మీడియా వేదికగా గాయత్రి భార్గవి రియాక్ట్ అయ్యారు.

Anchor Gayatri Bhargavi Fire On Famous Youtube Channel Details Inside Goes Viral

గాయత్రి భార్గవి ఆవేదనలో న్యాయం ఉందని థంబ్ నెయిల్స్ ను మరీ అంత ఘోరంగా క్రియేట్ చేయడం ఎంతవరకు రైట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గాయత్రి భార్గవికి నెటిజన్లు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు.ఎంతో పాపులర్ అయిన సదరు ఛానల్ ఫేక్ థంబ్ నెయిల్స్ వల్ల వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు .

Anchor Gayatri Bhargavi Fire On Famous Youtube Channel Details Inside Goes Viral
Advertisement
Anchor Gayatri Bhargavi Fire On Famous Youtube Channel Details Inside Goes Viral

సదరు యూట్యూబ్ ఛానల్ క్షమాపణలు చెప్పాలని గాయత్రి భార్గవి కోరుతుండగా ఆ ఛానల్ యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.పేరున్న సెలబ్రిటీలకే ఈ విధంగా జరిగితే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

గాయత్రి భార్గవికి న్యాయం జరగాలని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు