మదర్ థెరిస్సాకు ఆ గౌరవం దక్కుతుందా?

మదర్ థెరిస్సా ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.అమెరికాలో ఇప్పుడు ఆమె విషయమై చర్చ జరుగుతున్నది.

ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి.ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది.

ఒహియో గవర్నర్ జాన్ కసిచ్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నారు.ఆయన ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.

పది డాలర్ల నోటు మీద మదర్ థెరిస్సా బొమ్మ ముద్రించాలని ప్రతిపాదించారు.ఇలా ముద్రిస్తే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు.

Advertisement

ప్రస్తుతం పది డాలర్ల నోటు మీద అలేగ్జాందర్ హామిల్టన్ బొమ్మ ఉంది.ఆ స్థానంలో మహిళ బొమ్మా ముద్రించాలని అనుకుంటున్నారు.

ఖజానా శాఖ 2020 సంవత్సరంలో పది డాలర్ల నోటును మళ్ళీ డిజైన్ చేయనుంది.ఈలోగా పేరు నిర్ణయించాలి.

అమెరికా డాలర్ మీద ఒక భారతీయురాలి బొమ్మ ముద్రించాలని ప్రతిపాదించడం విశేషం.ప్రభుత్వ కరెన్సీ మీద ఇతర దేశాల వారి బొమ్మలు ముద్రించడానికి ఒప్పుకోరు.

మరి ఇది కార్యరూపం దాలుస్తుందా? చూడాలి.

వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?
Advertisement

తాజా వార్తలు