అరే.. కేక్ లను ఇలా కూడా చేపిస్తున్నారా..?!

ఇంటర్నెట్ పుణ్యమా అని రోజుకో కొత్త వస్తువు మన కళ్లకు కనిపించి మనల్ని ఆకట్టుకుంటోంది.

ఈ ఇంటర్నెట్ యుగంలో అందరికీ నచ్చేలా ఉండాలంటే మరింత స్పెషల్ గా ఉండాల్సిందే.

అందుకేనేమో.తాజాగా విభిన్నమైన కేకులకు కూడా క్రేజ్ పెరిగిపోతుంది.

అయితే మనం పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్‌ వేడుకలు ఇలా శుభకార్యం ఏదైనా కేక్‌ ఉండాల్సిందే మరి.అయితే కేక్‌ కటింగ్‌​ చేస్తేనే స్పెషల్‌ డేగా ఫీల్‌ అవుతాం.మరి కేక్‌ కు ఇంతలా డిమాండ్‌ పెరుగుతండటంతో తయారీదారులు(బేకర్స్‌) కూడా విభిన్న రూపాల్లో డిజైన్‌ చేస్తున్నారు.

మనకు నచ్చే విధంగా కొత్త కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు.ఇటీవలే హాస్పిటల్‌ బెడ్‌ పై నవ్వుతున్న ఓ పేషెంట్‌ లా తయారు చేసిన కేకు ఒకటి ట్రెండ్‌‌ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Cake, Amazon Parcel, Viral Latest, Viral News, Social Media, Cake Look Like Amaz

తాజాగా ఈ కోవకే చెందిన ఓ వినూత్న కేక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇది సాధారణమైన కేక్‌ కాదండోయ్‌.అమెజాన్‌ పార్సిల్‌ రూపంలో ఉన్న కేక్.

Cake, Amazon Parcel, Viral Latest, Viral News, Social Media, Cake Look Like Amaz

అవును మీరు విన్నది నిజమే.అచ్చం అమెజాన్‌ నుంచి వచ్చే ప్యాకేజ్‌ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ ను డిజైన్‌ చేశారు.అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్‌ చేసింది.

యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్‌ తయారు చేశారు.ఇక దీనిని ట్వీటర్‌ లో పోస్టు చేయడంతో అమెజాన్‌ పార్సిల్‌ కేక్‌ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్‌ పార్సిల్‌ అనుకుంటున్నారు.కానీ, అది కేక్‌ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఈ తర్వాత కేక్‌ అని క్లారిటీ రావడంతో సర్ప్రైజ్‌ అవుతున్నారు.అంతేగాక అనేకమంది నెటిజన్లు ఈ కేక్‌ పై మీమ్స్‌ సృష్టిస్తున్నారు.

Advertisement

మరి ఇతంలా వైరలవుతున్న దాని‌పై మీరు కూడా ఓ లుక్కేయండి ఈ ట్వీట్‌కు వేలల్లో లైక్‌ లు వస్తున్నాయి.ఈ ప్యాకేజీ కేకును తయారు చేసిన వ్యక్తి పనితీరును మెచ్చుకుంటున్నారు.

దీనికి చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటి నుంచి అమెజాన్ పార్సిల్‌ ను బాగా నలిపిన తరువాతే డెలివరీ బాయ్ నుంచి తీసుకోవాలని ఒక వ్యక్తి కామెంట్ రాశారు.

తాజా వార్తలు